విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ ఆశోక్ నగర్ నందు 20లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఏదైనా నియోజకవర్గంలో ఆ పార్టీ వారు ఓడిపోతే అసలు ఆ నియోజకవర్గ అభివృద్ధి ని పట్టించుకోనేవారే కాదని, నగరంలో ఏదైనా డివిజన్ లో ఒడిపోయిన అదే పరిస్థితి అని విమర్శించారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తూర్పు లో ఓడిన సరే 500కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కి సహకరిస్తున్నరని అన్నారు. ఈ 8వ డివిజన్ లో మా పార్టీ అభ్యర్థి ఓడిన సరే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష కార్పొరేటర్ ను కూడా ఆ కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ వారు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు కూడా తక్షణమే పరిష్కరిస్తూ నూతన సాంప్రదయనికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు అని మిగతా అంతా ప్రజా సంక్షేమానికే మా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ ఇంచార్జ్ యలంచిలి జయ ప్రకాష్,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్థానిక టిడిపి కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి,కోగంటి రామారావు,ఝాన్సీ,రఘు,కృష్ణమోహన్ రెడ్డి,సలీం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News