Breaking News

అత్యంత ఆడంబరంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మాజీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను విజయవంతంగా విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ లో రంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు  భారీ కేకును కట్ చేసి రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ శకం రాబోతుందని, కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టబోతుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని ఇక కాంగ్రెస్ ప్రభంజనమేనని ఆయన అన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని పూజ కార్యక్రమాలు నిర్వహించి లాంచనంగా ప్రారంభించారు. అదే ప్రచార రథంలో రుద్రరాజు ప్రయాణించి పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఆయనతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, వి గురునాథం,దనేకుల మురళి,మేడ సురేష్,గొల్లు కృష్ణ,పి వై కిరణ్,పి నాంచారయ్య,వి శ్రీనివాస్,కాజా మొహీధ్ధీన్,డాక్టర్ జంధ్యాల శాస్త్రి, మీసాల రాజేశ్వరరావు, పి సతీష్, బైపూడి నాగేశ్వరరావు, గౌస్, బేగ్, ఖుర్షీదా, మహిళా నాయకులు, కార్యకర్తలతో, బాణసంచా శబ్దాలతో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *