Breaking News

మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ లలో మురుగునీటి పారుదల

-త్రాగునీటి సరఫరా విధానము మరియు పారిశుధ్య నిర్వహణ పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ సోమవారం అధికారులతో కలిసి పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని 56 వ డివిజన్ లోని పాతరాజరాజేస్వరి పేటలో జె.పి.అపార్ట్మెంట్ మొదలగు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మేజరు అవుట్ ఫాల్ డ్రెయిన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, త్రాగునీటి సరఫరా విధానము, ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.

అదే విధంగా 56 వ డివిజన్ పాతరాజరాజేస్వరి పేట లో జె.పి.అపార్ట్మెంట్ నందు యు.జీ.డి నందలి మురుగునీటి పారుదల నిలిచిపోవడం వలన ఓవర్ ఫ్లో అవ్వడం రోడ్ల మీద మురుగునీరు నిల్వ ఉండుట గమనించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేసినారు. ప్రధానంగా ఇంజనీరింగ్, ప్రజారోగ్య మరియు పట్టణ ప్రణాళికా విభాగము వారు సమన్వయంతో పని చేసి రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. డివిజన్ లోని మొదలగు ప్రాంతాలలో మేజర్ డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల తీరును పరిశీలిస్తూ, రైల్వే ట్రాక్ దిగివకు ఎటువంటి చెత్త వెళ్ళకుండా గ్రట్టింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంలో మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్స్ ఎండింగ్ పాయింట్స్ వద్ద ఫ్లోటింగ్ చెత్త తొలగింపు పనులకు సంబందించిన వివరాలు అందించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంలో ఆయా మేజరు అవుట్ ఫాల్ డ్రైయిన్స్ లో సిల్ట్ తొలగింపు పనులు యుద్దప్రాతిపధికన చేపట్టి మురుగునీరు సక్రమముగా ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సైడ్ డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకు అవరోధకరంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించి డ్రెయిన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని అన్నారు.

పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని 56 వ డివిజన్ లో గడపగడపకు పర్యటించిన సందర్భంలో డివిజన్ ప్రజలు మంచినీటి సరఫరాకు సంబందించి త్రాగునీరు రంగు మారుట మరియు వాసన వస్తుందని తెలిపిన సమస్యలపై కమిషనర్ స్పందిస్తూ డివిజన్ పరిధిలో మంచినీటి సరఫరా విధానమునకు సంబందించి వాటర్ పైప్ లైన్ లీకేజిలు లేకుండా చూడాలని వాటర్ పైప్ లైన్ లలో గుర్తించిన లీకేజిలకు యుద్దప్రాతిపదికన తగిన మరమ్మతులు చేపట్టి త్రాగునీరు వృధా కాకుండా చూడాలని సంబందిత అధికారులకు సూచించారు. రిజర్వాయర్లకు రక్షిత నీటి సరఫరా విధానముపై పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని మరియు శివారు ప్రాంత వాసులకు కూడా రక్షిత నీటి సరఫరా అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పర్యటనలో 56 వ డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతిరావు, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నారాయణమూర్తి, వెంకటేశ్వర రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *