Breaking News

గుడివాడలో ఈనెల 24న న్యాయ సేవల శిబిరం

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ చట్టాల పట్ల, ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఈనెల 24వ తేదీన గుడివాడలో న్యాయ సేవల శిబిరం ఏర్పాటు చేస్తున్నారని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని గుడివాడ ఆర్డిఓ పి. పద్మావతి అధికారులకు సూచించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్లో అధికారులతో ఆర్డిఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు గుడివాడలో వికేఆర్, విఎన్బి అండ్ ఎజీకే ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో న్యాయ సేవల శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమం కోసం అమలయ్యే చట్టాలు గురించిన అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ పి. జాషువా, పలువురు న్యాయమూర్తులు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో వివిధ సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించుటకు ఆయా సంక్షేమ శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ అధికారులకు సూచించారు. దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారులకు ట్రై మోటార్ సైకిల్స్, వినికిడి పరికరాలు, లాప్టాప్ లు వంటి పరికరాలు పంపిణీకి ఏర్పాటు చేయాలని సూచించారు. శానిటేషన్, త్రాగునీటి సరఫరా సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేయాలన్నారు.విద్యాశాఖ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు అధికారులు సమన్వయంతో కృషిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం గావించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, డిఆర్డిఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్, ఎంపీడీవో ఏవి రమణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *