-ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం పోర్టు పనుల శంకుస్థాపన మొదలైన తర్వాత నెల రోజుల వ్యవధిలో పోర్టు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు పురోగతి పరుగులు పెడుతుందని మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం ఆయన మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించేందుకు పాత్రికేయుల బృందంతో సందర్శించారు. తొలుత 190 మీటర్ల వరకు కొనసాగిన నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. మెఘా ఇంజనీరింగ్ హెడ్ తులసి దాస్ తో పాటు సాంకేతిక సిబ్బంది, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివయ్య, ఇతర అధికారులు ఎమ్మెల్యే పేర్ని నానికి స్వాగతం పలికారు. బెర్తుల నిర్మాణం, భూమిలో ఫైలింగ్,పోర్టు అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై స్వయంగా ఆయా స్థలాల వద్దకు తీసుకువెళ్లి చిత్రపటాల ద్వారా వివరించారు.
అనంతరం పోర్టు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పాత్రికేయులతో మాట్లాడుతూ, కృష్ణా జిల్లావాసులు దశాబ్దాల కాలం నుంచి ఎదురుచూస్తున్న కల వేగంగా సాకారం అవుతుందని, మే నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమృత హస్తాల మీదుగా ప్రారంభమైన పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణ మార్గం రెండు కిలోమీటర్ల 75 మీటర్ల పొడవుగా కొనసాగిన ఉందని సరిగ్గా 30 రోజుల వ్యవధిలో ప్రస్తుతం 190 మీటర్ల దూరం కొనసాగడం గమనాభం అన్నారు.
ఎన్నికలు ఏడాదికాలం ఉండనగా పోర్టు నిర్మాణ పనులు జరుగుతాయా అని కొందరు పలు సందేహాలు లేవనెత్తారని, వారి అనుమానాలు పటాపంచలు చేస్తూ మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు అత్యంత వేగంగా పూర్తవుతున్నాయని దీంతో మచిలీపట్నం పోర్టు నిర్మాణ ప్రక్రియ నిర్ణీత గడువు 30 నెలలు కాగా, అంతకుముందే 4 బెర్తుల నిర్మాణం పూర్తి కావడం ఖాయం అని ఎమ్మెల్యే పేర్ని నాని విశ్వాసం వ్యక్తపరిచారు
ప్రస్తుతం జరుగుతున్న ఫోర్ బ్యాక్ వాటర్ పనులలో మరొక లేయర్ పరుచుతారని సౌత్ బ్రేక్ వాటర్ నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణం చివరి వరకు వెళ్ళిన తర్వాత ఆరు మాసాల పాటు సముద్రంలో ఆ నిర్మాణం సెటిల్మెంట్ దశ కోసం వేచి ఉంటారని ఆ తర్వాత మరో లేయర్ ను పరుచుతారన్నారు.
జూన్ నెల ఎనిమిదో తేదీన నార్త్ బ్రేక్ వాటర్ పనులకు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించామని కేవలం 14 రోజుల వ్యవధిలో సముద్రంలో 100 మీటర్ల దూరం కొండ రాళ్లు పరుచుకుంటూ పనులు ముందుకు వెళుతున్నాయి అన్నారు. తాను ప్రతి నెల పాత్రికేయ బృందాన్ని పోర్టు నిర్మాణ ప్రాంతానికి తీసుకువచ్చి అక్కడ జరుగుతున్న పురోగతిని మీడియా పరంగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయునట్లు ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు.
బల్క్ కార్గో స్టోర్ చేయాలంటే బెర్తులు నిర్మాణం చేసే ప్రాంతంలో నేలను పటిష్టపరచాల్సిన దశ ఉందని ప్రస్తుతం ఆ పనులు మరోవైపు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. బెర్తుల వద్ద బొగ్గు, ఇనుప ఖనిజం పెద్ద స్థాయిలో నిల్వ చేస్తారని, అయితే ఆ బరువును తట్టుకునేందుకు ఫైలింగ్ టెస్ట్, సాయిల్ టెస్ట్ పనులు మరోవైపు జరుగుతున్నాయన్నారు. ఆ పనులు పూర్తయిన తర్వాత బెర్తలను డిజైన్ చేస్తారని, అలాగే సముద్రంలో పూడిక తీత పనులు కొనసాగుతాయని ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. పోర్టు నిర్మాణంతో యావత్ కృష్ణాజిల్లా ముఖచిత్రం మారడంతోపాటు అన్నిరంగాల అభివృద్ధికి పోర్టు చేయుత అందించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు.
Prajavartha Online Telugu News