Breaking News

విద్యే తరగని ఆస్థి..

-గిరిజన జాతి అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యం..
-తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించండి..
-సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి గిరిజన లబ్దిదారుడు సద్వినియోగం చేసుకోండి..
-అటవీ హక్కుల గుర్తింపు (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) చట్టాన్ని దేశంలో తొలి సారి మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం..
-హక్కులకు భంగం కలిగినట్లు ఫిర్యాధు వస్తే.. చర్యలు తప్పవు..
-రాష్ట్ర ఎస్టీ కమీషన్‌ సభ్యులు వడిత్యా శంకర్‌ నాయక్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజనుల హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి గిరిజన లబ్దిదారునికి చేరువ చేయాలని రాష్ట్ర ఎస్టీ కమీషన్‌ సభ్యులు వడిత్యా శంకర్‌ నాయక్‌ అధికారులను ఆదేశించారు.
మైలవరం మండలం పొరాటనగర్‌, కనిమెర్ల తండాలలో గురువారం కమీషన్‌ సభ్యులు వడిత్యా శంకర్‌ నాయక్‌ విస్తృతంగా పర్యటించి గిరిజనుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత కనిమెర్ల ప్రాధమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి పాఠ్యాంశాలను చదివించి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. పోరాట నగర్‌ అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహారాన్ని రుచి చూసి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్లను పరిశీలించారు.
వెదురుబీడెం గ్రామ మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఎస్టీ కమీషన్‌ సభ్యులు వడిత్యా శంకర్‌ నాయక్‌ స్థానిక తండా వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటవీ, రెవెన్యూ, విద్య, వైద్య, ఆరోగ్య శాఖ, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, పోలీస్‌, వ్యవసాయ శాఖల ద్వారా గిరిజన సంక్షేమం పై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
అటవీ శాఖ అధికారులతో సమీక్షిస్తూ వ్యవసాయ సాగుకు, బోరులు వేసుకునేందుకు అడ్డు రాకుడదని అమాయక గిరిజనుల రక్షణకు కమీషన్‌ అండగా ఉంటుందన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు మానవత దృడ్పదంతో వ్యవహరించి సాగు త్రాగునీటి అవసరాలను తీర్చాలన్నారు. 2005 సంవత్సరం నుండి సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను మంజూరు చేయాలన్నారు. గృహాలు నిర్మించుకునేందుకు పోజిషన్‌ సర్టిఫికేట్లను మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. న్యాయ స్థానాల వివాదం లేని భూములకు పట్టాలను మంజూరు చేయాలని కోరారు. ఈ వారంలో అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించుకుని అర్హులైన లబ్దిదారులకు పట్టాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో సమీక్షిస్తూ 50 లక్షల డిస్టిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ నిధులతో తండాలలో సిసిరోడ్డు తదితర అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారుతో సమీక్షిస్తూ జలజీవన్‌ మిషన్‌ ద్వారా మంజూరైన 9 లక్షల నిధులతో తండాలలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ అందించాలని, ఫ్లోరైడ్‌ సమస్య ఎక్కువగా ఉన్నందున త్వరితగతిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షిస్తూ ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అంటు వ్యాధులు ప్రభలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా పోరాట నగర్‌, కనిమెర్ల తండా వాసులకు అందుబాటులో ఉండేలా కీర్తిరాయుని గుడెంలో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. గిరిజనలకు ఆధార్‌, రెషన్‌, ఓటర్‌ కార్డులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దికి ఆధార్‌ తప్పనిసరైనందున స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా అవగాహన కల్పించి జగనన్న సురక్ష కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించాలన్నారు. ఉపాధి హామి పథకంలో ప్రతీ గిరిజన లబ్దిదారునికి పని కల్పించాలని ప్రతీ ఒక్కరికి జాబ్‌ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఫిల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులో చదువుకున్న గిరిజన విద్యార్థిని నియమించాలన్నారు. తండాలలో ఎస్సీ ఎస్టీ వర్గాలపై ఇప్పటి వరకు నమోదైన అట్రాసిటీ కేసుల వివరాలను పోలీస్‌ అధికారుల నుండి అడిగి తెలుసుకుని నేటి వరకు ఒక కేసు కూడా నమోదు కాకపోడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షిస్తూ గిరిజన కౌలు రైతులకు ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వం మంజూరు చేస్తున్న 50 శాతం రాయితీ విత్తనాలు మంజూరు చేయాలని, కౌలు గిరిజన రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు.
అనంతరం అధికారులతో కమీషన్‌ సభ్యులు మాట్లాడుతూ ప్రతీ శాఖలోను 6 శాతం నిధులు గిరిజన సంక్షేమానికి ఖర్చు చేయాలని ఎస్టీ సబ్‌ప్లాన్‌ కోటి రూపాయల నిధులలో 6 లక్షలు తప్పనిసరిగా గిరిజన తండాలలో అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉందన్నారు. రాజ్యంగ బద్దంగా గిరిజనలకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కులను వారు సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వారిని అన్ని రంగాలలోను అభివృద్ధి వైపు ముందుకు తీసుకురావాలన్నారు.
సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి యం. రుక్మాంగదయ్య, తహాశీల్థార్‌ శ్రీనివాస్‌ కనిమెర్ల గ్రామ సర్పంచ్‌ మోహన్‌నాయక్‌, వెదురుబీడెం గ్రామ సర్పంచ్‌ లావూరి సాంబశివరావు, యంపిపి ఐ.ప్రసన్నలక్ష్మి, యంపిడివో బియం లక్ష్మి కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం సుహాసిని, ఎఫ్‌ ఆర్‌వో ఎన్‌ రాధాకూమారి, పంచాయతీ రాజ్‌ ఏఇ రమణ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఇ ప్రసాద్‌, ఏఇ ఆర్‌ నవీణ్‌కుమార్‌, పిహెచ్‌సి డా. ఆర్‌ నరేష్‌, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *