– జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా సహకార అభివృద్ది కమిటీ (డిసిడిసి) తొలి సమావేశాన్ని కమిటీ సభ్యులతో గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ సహకార రంగానికి పుర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆయా శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. నేషనల్ కో`ఆపరేటివ్ డేటాబేస్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లాలోని గ్రామ పంచాయతీ పరిధిలో కొత్త బహుళ ప్రయోజన సహకార సంఘాలు మత్స్య సహకార సంఘాలు ప్రాధమిక డైరీ సహకార సంఘాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందన్నారు. సహకార సంఘాల కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని,తద్వారా ఆదాయాన్ని పెంచేందుకు అనువైన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలను సద్వినియోగించుకొని సహకార సంఘాల పరిధి పెంచాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో సేవా రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖల పరిధిలో ఏర్పాటైన సహకార సంఘాల కార్యకలాపాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సంబంధిత సహకార సంఘాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కమిటీ కీలక పాత్ర పొషించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
జిల్లా సహకార అధికారి చిత్రపు శైలజ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర సహకార సంఘాల చట్టం` 1964 ప్రకారం 920 సహకార సంఘాలు, రాష్ట్ర పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం `1995 ప్రకారం 1985 సహకార సంఘాలు ఉన్నాయన్నారు. ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, మత్స్య డైరీ రంగంలోని సహకార సంఘాలను అన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగిందన్నారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసేలా సహకార సంఘాల సేవలను గ్రామ స్థాయి వరకు విస్తృత పరిచేందుకు రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ జిల్లా సహకార అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
జూమ్ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్‌కుమార్, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ కె. విద్యాసాగర్, వ్యవసాయ శాఖ జాయింట్ కలెక్టర్ ఎస్ నాగమణమ్మ, డిపివో జయచంద్ర (గాంధీ) మత్స్యశాఖ డిప్యూటి డైరెక్టర్ నాగరాజా, నాబార్డ్ డిడియం, కమిటీ సభ్యులు ఉన్నారు.
Prajavartha Online Telugu News