మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 213 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. కంప్యూటరైజేషన్ ఆఫ్ పిఎసిఎస్ ప్రాజెక్టు అమలు జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లో జరిగింది. రు.8.33 కోట్లతో జిల్లాలో 213 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను కంప్యూటరీ కరణ చేయుటకు చర్యలు చేపట్టు టకు కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ క్రింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రు.2516 కోట్లతో 97 వేలకు పైగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీరణ ప్రాజెక్టు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా 2037 పి ఎ సి ఎస్ లనుకంప్యూటరీకరణ చేపట్టారని అన్నారు. కృష్ణా జిల్లాలో 213 పిఎసిఎస్ల కంప్యూటరీకరణ 8.33 కోట్లతో చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30% , నాబార్డు 10 శాతం భరిస్తాయన్నారు. ఒక్కొక్క పిఎసిఎస్ లో కంప్యూటరీకరణకు దాదాపు 4 లక్షల వరకు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్య కన్వీనర్/ కేడీసీసీ బ్యాంక్ సీఈవో ఏ శ్యాం మనోహర్, సభ్యులు నాబార్డ్ డీడీఎం మిలింద్ చౌలాస్కర్, డిసిఒ ఫణికుమార్, ఆప్కాబ్ డిపిడిఎం డి సింధుజ, కమిటీలో సభ్యులైన పిఎసిఎస్ ల కార్యదర్శులు వీ కళ్యాణ్, జె కృష్ణ శంకర్, జి లోకేశ్వరరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News