నగరంలో స్కూజో ఐస్ క్రీమ్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో మొట్టమొదటిసారిగా స్కూజో డెజర్ట్‌ కేఫ్‌ నూతనంగా ప్రారంభమైంది. గురునానక్‌కాలనీలో ఉషోదయ సూపర్‌ మార్కెట్‌ పక్కన శుక్రవారం స్కూజో డెజర్ట్‌ కేఫ్‌ను ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు డి.రమేష్‌. ఓఎస్‌డి టూ స్పెషల్‌ సీఎస్‌ సిహెచ్‌.పద్మావతి ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు టి.మహాదేవ్‌, సిహెచ్‌.శ్రీనివాస్‌లు మాట్లాడుతూ విజయవాడలో మొట్టమొదటిసారిగా లైవ్‌లో డెజర్ట్‌ తయారు చేయడం స్కూజో డెజర్ట్‌ కేఫ్‌ ప్రత్యేకత అని ఎటువంటి కెమికల్స్‌ ప్రిజర్వేట్విస్‌ లేకుండా ఫ్రూట్స్‌ నుండి తయారు చేసి హానీ బేసిడ్‌గా అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు. ఆధునాతన మిషనరీలతో తయారుచేసి మంచి క్వాలిటీతో పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా తమకు నచ్చిన డెసర్ట్స్‌ను అతి తక్కువ క్యాలరీలు కలిగినవి తిని ఆస్వాదించవచ్చునని అన్నారు. కూల్డ్‌ మరియు హాట్‌ బేవరేజస్‌లలో ఫలూదా, మొజిటో, కోల్డ్‌ కాఫీ, హాట్‌ చాక్‌ లెట్‌, కాప్పఛీనో, ఎస్స్‌ ప్రెస్సో మొదలుగునవి లభిస్తాయని, హోమ్‌ డెలివరి సదుపాయం కూడా ఉన్నదని, పార్టీలకు ఫంక్షన్‌లకు సప్లయి చేస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *