-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘జగనన్న సురక్ష’’ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతీ ఇంటిని సందర్శంచి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని ఆయన కార్యాలయం నుండి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ప్లానింగ్‌బోర్డు వైఎస్ చైర్మన్ మల్లాదివిష్ణువర్థన్, నగరపాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టి. శ్రీకాంత్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ, ఇండస్ట్రిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి శివశక్తి పుణ్యశ్రీ, జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి, బట్రాజ్‌కార్పొరేషన్ చైర్మన్ కూరపాటి గీతాంజలిదేవి, సివిల్ సప్లయి స్టేట్ బోర్డు డైరెక్టర్ టి. చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి కె. అనురాధ హాజరయ్యారు.
కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యను తెలుసుకుని పరిష్కారం చూపించే దిశగా నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం జగనన్న సురక్ష అని అన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా పోరపాటున ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా సంక్షేమ పథకాలు అందించి లబ్ది చేకూర్చాలని అన్నారు.
జూన్ 24వ తేది నుండి గృహ సందర్శన:
ఈనెల 24వ తేది శనివారం నుండి ప్రారంభమయ్యే కార్యక్రమంలో జిల్లాలోని 16 మండలాలు 4 మున్సిపాలిటీలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు మొత్తం 605 సచివాలయాల నందు 10,256 మంది వాలంటీర్లు వారికి కేటాయించిన ప్రతీ ఇంటికి వెళ్ళి వాలంటీర్ యాప్ నందు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అవగాహన మరియు సంక్షేమ ఫలాలు వారికి అందుతున్న తీరు గురించి నిర్థేశించిన ప్రశ్నావళిని పూరించాలన్నారు. అనంతరం ప్రభుత్వం నుండి పంపిణీ చేసిన పొకెట్ క్యాలెండర్‌ను అందజేసి వారితో దిగిన ఫోటోను యాప్‌లో అప్‌లోడ్ చేసి ఈ`కెవైసి పూర్తి చేయాలన్నారు.
జూలై 1వ తేది నుండి క్యాంపుల నిర్వహణ:
జూలై 1వ తేది నుండి ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రతీ మండల మున్సిపల్ పరిధిలో తహాశీల్థార్ ఆధ్వర్యంలో ఒక టీమ్, యంపిడివో మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో మరోక టీమ్ రోజు రెండు సచివాలయాలు సందర్శించి వాలంటీర్ యాప్‌లో ప్రజలు అడిగిన సేవలను పరిసిలించి అర్హులైన వారికి దృవపత్రాలు, ఇతర సేవలు అందజేయాలన్నారు. వాలంటీర్లు గృహాలను సందర్శించిన్నప్పుడు ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లకు సంబంధించి డాక్యుమెంట్లను సేకరించి సచివాలయాలకు అందజేసి టోకెన్ జనరేట్ చేయించి ఆయా టోకెన్‌లను తిరిగి అందజేయాలన్నారు.ఈ సేవలన్ని ప్రజలకు ఉచితంగానే అందజేయాలన్నారు.
ప్రజాసమస్యలలో ముఖ్యంగా కుల, ఆధాయ, జనన, మరణ, వివాహ దృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుడి దృవీకరణ పత్రం, ఆధార్‌తో మొబైల్ అనుసందానం, క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు, మ్యుటేషన్ లావాదేవీలు వంటి వాటి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని వాలంటీర్లకు, అధికారులకు కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
Prajavartha Online Telugu News