రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా నీటి యాజమాన్య సంస్థ తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి సమన్వయం మరియు పర్యవేక్షణ కమిటీ (దిషా) సమావేశం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జూలై 27 మంగళవారం మ.3 గంటలకు నిర్వహించడం జరుగుతుందని డ్వామా పిడి జీ ఎస్ రామ్ గోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 సంవత్సరంకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధ్వర్యంలో అమలు జరుగుతున్న వివిధ శాఖల పథకాలు అమలు పై సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. సమావేశం జిల్లా కలెక్టర్ కే. మాధవీలత అధ్యక్షతన జరుగుతోందని, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ ఈ కమిటీ సమావేశానికి ఛైర్మన్ గా వ్యవహరించ నుండగా, జిల్లా ఇంఛార్జి మంత్రి, జిల్లా మంత్రి, ఎంపి లు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు హాజరు కావడం జరుగుతుందని తెలియ చేశారు.
Tags rajamendri
Check Also
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి… : ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు
-భక్తిశ్రద్ధలతో గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ …
Prajavartha Online Telugu News