-తిరుపతిని కుష్టు రహిత జిల్లాగా చేద్దాం!!!
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు జాతీయ కుష్టు నివారణ కార్యక్రమం (NLEP) లో భాగంగా కుష్టు వ్యాధి ఇంటింటి సర్వే కార్యక్రమము 2023 (LEPROSY CASE DETECTION CAMPAIGN) తేదీ26/06/2023 నుండి 16/07/2023 వరకు జరుగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి Dr. శ్రీహరి మరియు జిల్లా కుష్టు, ఎయిడ్స్ & టీ బి అధికారి Dr. అరుణ సులోచన దేవి గారు తెలియజేశారు. వైద్య ఆరోగ్యశాఖాధిపతులతో, లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో డిస్టిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశము కలెక్టరేట్లో ఈ మధ్యనే నిర్వహించడం జరిగిందనీ, తదుపరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని వైద్యాధికారులకు, నోడల్ ఆఫీసర్లకు, ఏఎన్ఎం ,ఆశలకు LCDC పై జిల్లా కుష్టు ఎయిడ్స్ & టీబీ అధికారి Dr. అరుణ సులోచన దేవి గారు శిక్షణ ఇవ్వడం పూర్తయిందని తెలిపారు. రేపటినుండి జరగబోయే ఎల్సిడిసి కార్యక్రమానికి సర్వం సిద్ధమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశలు 1686 మరియు వాలంటీర్లు 1686 మొత్తం 3372 మంది సూపర్వైజర్లు 707 మంది సర్వేలో పాల్గొంటారని తెలియజేశారు. పట్టణ ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటారని తెలియచేసారు.
*కుష్టు వ్యాధితో పోరాడుదాం & కుష్టు వ్యాధిని చరిత్రగా చేద్దాం! అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.
*కుష్టు వ్యాధి మైకో బాక్టీరియం వలన వస్తుందని దీని అంతర్గత కాలం రెండు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరములు ఉండటం వలన ఈ వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుందన్నారు.
*కుష్టు వ్యాధి పాపం వలన, శాపం వలన, రాదని వంశ పారంపర్యం కాదని ఈ జబ్బు ఎవరికైనా రావచ్చని లింగ భేదము, వయసు తారతమ్యము లేదన్నారు.
కుష్టు వ్యాధి లక్షణాలు.
చర్మంపై స్పర్శ లేని మచ్చలు
నరములు ఉబెత్తుగా మందముగా ఉండడము
వేడి నొప్పి స్పష్టంగా ఉండవు
కనుబొమ్మల పైన పాక్షికంగా లేదా పూర్తిగా వెంట్రుకలు ఉండవు
ముక్కు లోపలికి పోయినట్టుగా నొక్కిపోయి ఉంటుంది.
మచ్చలు శరీరమంతటా వస్తాయి, చేతుల పైన పి రుదల పైన కాళ్ళ పైన ఎక్కువగా వస్తాయి.
చేతి వేళ్ళు, కాలి వేళ్ళు వంకర్లు పోతాయి, స్పర్శ జ్ఞానం ఉండదు.
కాళ్లలో చెప్పులు జారిపోవడం
చెవుల పైన బుడిపలు వస్తాయి మరియు సాగుతాయి.
కళ్ళు మూత పొడవు.
ఈ సంవత్సరం లక్ష్యం…. 2023-24 సంవత్సరంలో ప్రివలెన్స్ రేటు (PR) >0.3%, కుష్టు రోగులు కనుగొన్న సంఖ్య , April to May 13 Cases వ్యాధిగ్రస్తులు On Hand Cases: 116 ఉన్నాయి. అందులో PB: 31 MB: 81 గా ఉన్నాయి. చైల్డ్ కేసెస్. 4 ఉన్నాయి. Reconstructive Surgery cases. 2022-23 సంవత్సరంలో 4 Cases జరిగినవి. అంగ వైకల్యం గల వారి సంఖ్య: 854 (Gr.I: 134, Gr.II:720) పెన్షన్ పొందిన వారి సంఖ్య: 613 . ఈ సంవత్సరం MCR 456 పాదరక్షలు అందచేయడం జరిగినది.
అన్ని శాఖ విభాగాధిపతుల సహాయ సహకారములతో జిల్లాలో 100% కుష్టు వ్యాధిని నివారించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసి ” కుష్టు వ్యాధితో పోరాడుదాం & కుష్టు వ్యాధిని గత చరిత్రగా చేద్దాం”. అనే నినాదంతో ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి అంగవైకల్యాన్ని నివారించాలని జాతిపిత మహాత్మా గాంధీ కన్న కలలను సహకారం చేయాలని కోరారు. ఇంటింటి సర్వే కార్యక్రమానికి ప్రజలు సహకారం అందించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Prajavartha Online Telugu News