వైఎస్సార్‌ లా నేస్తంతో యువ న్యాయవాదులకు ఆర్థిక చేయూత…

-జిల్లాలో 182 మంది జానియర్‌న్యాయవాధులకు రూ. 44 లక్షల 60 వేల లబ్ది..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్‌ లా నేస్తం జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక భరోసాగా నిలిచి న్యాయవాది వృత్తిలో స్థిరపడేందుకు ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు అన్నారు.రాష్ట్ర్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి సోమవారం మూడవ విడత జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక చేయూతను అందించే వైఎస్సార్‌ లా నేస్తం పథకాన్ని వర్చువల్‌ గా ప్రారంభించిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు.ఎన్టీఆర్‌ జిల్లా నుండి కలెక్టర్‌ కార్యాలయల వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు, రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌, శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్‌, మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీ శైలజ రెడ్డి, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌, జైన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మనోజ్‌ కొఠారి, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ గౌస్‌ మొహంతి, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ జమల పూర్ణమ్మ, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సభ్యులు విజిత పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్‌ ఢల్లీిరావు మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌ లా నేస్తం పథకం అమలు తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కి వివరించారు. జిల్లాలో 182 మంది న్యాయవాదులు ఈ పథకం ద్వారా 44 లక్షల 60 వేల రూపాయల లబ్ది పొందుతున్నారని, వీరిలో 42 మంది షెడ్యూల్‌ కులానికి, 13 మంది షెడ్యూల్‌ తెగలకు చెందిన వారున్నారన్నారు. జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న వైఎస్సార్‌ లా నేస్తం పథకాన్ని ఎంతో సహాయ కారిగా ఉంటుందన్నారు. జూనియర్‌ న్యాయవాదులు తమ వృత్తిలో ఎదగాలంటే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. ఈ పథకం ద్వారా వారి ఆర్థిక అవసరాలు ముఖ్యంగా పుస్తకాలు, డ్రస్‌, రవాణా తదితర ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతున్నట్టుగా కొందరు యువ న్యాయవాదులు తన దృష్టికి తెచ్చారన్నారు. ఈ పథకం ‘‘ లా’’ చదవాలనుకున్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసాగా ఉంటుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.జూనియర్‌ న్యాయవాది వీర్ల అరవింద్‌ ముఖ్యమంత్రితో మూఖాముఖి.జూనియర్‌ న్యాయవాది వీర్ల అరవింద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడుతూ వైఎస్సార్‌ లా నేస్తం తాము వృత్తిలో ఎదిగేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 2020 సవత్సరంలో జూనియర్‌ న్యాయవాదిగా వృత్తిన్ని చేపట్టి బెజవాడ బార్‌ అసోసియేషన్‌ లో సభ్యుడిగా చేరానని తనకు చిన్నప్పటి నుండి న్యాయవాది వృత్తి పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడినని అన్నారు. వృత్తి పట్ల తన ఇష్టాన్ని కుటుంబ సభ్యులు ఇబ్బందికరంగా వ్యవహరించేవారని, దీనికి కారణం న్యాయవాది వృత్తిలో మొదట్లో ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయని వృత్తిలో నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుందని ప్రోత్సహించేవారు కాదని అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో జూనియర్‌ న్యాయవాదుల కష్టాలను తెలుసుకొని పదవి భాద్యతలు చేపట్టిన వెంటనే వైఎస్సార్‌ లా నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టడం వలన తనలాంటి ఎంతో మంది జూనియర్‌ లాయర్లకు ఈ పథకం చేదోడుగా ఉందన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నానని ప్రతి నెల 5000 రూపాయలు తన ఖాతాలలో జమ అవుతున్నాయన్నారు. ప్రాక్టీస్‌ కి సంబంధించి న్యాయవాది వృత్తిలో అవసరమైన పుస్తకాలు, ప్రయాణ ఖర్చులు, డ్రస్‌ కొనుగోలు చేసుకోడానికి లా నేస్తం ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. న్యాయవాది వృత్తి పట్ల తన కుటుంబ సభ్యులలో ఉన్న అపోహలు కోల్పోయి ధైర్యాన్ని నింపిందని జూనియర్‌ న్యాయవాది వీర్ల అరవింద్‌ ముఖ్యమంత్రికి వివరించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కె. సుందర్‌, జాయింట్‌ సెక్రటరీ నరహర శెట్టి జ్యోతి, మహిళా విభాగపు సెక్రటరీ పి. జయలక్ష్మి, న్యాయవాది పి. జ్యోతి, లబ్దిదారులైన జూనియర్‌ లాయర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *