విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో నమోదైన ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పిసంపత్‌కుమార్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ప్రజల నుండి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టరు డిల్లీరావు మాట్లాడుతూ ఆర్జీదారులు తమ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మకంతో స్పందన కార్యక్రమంలో వినతులు సమర్పిస్తారన్నారు. తమ సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో సమర్పించిన ప్రతి ఆర్జీదారుని సమస్యను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఆర్జీని నిశితంగా పరిశీలించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఆర్జీదారులలో కలుగుతుందన్నారు. స్పందనలో వచ్చిన ఆర్జీ పరిష్కారానికి సంబంధిత మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడివోలు, తహాశీల్థార్లతో వర్చువల్‌గా మాట్లాడి సమస్యను వారికి వివరించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పందనలో రెవెన్యూ, విద్య, పోలీస్ శాఖలకు చెందిన ఆర్జీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి ఏ ఒక్క దరఖాస్తు వెళ్లకూడదన్నారు. స్పందన ఆర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణిత కాల పరిమితిలోగా పరిష్కరించాలన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని కాలయాపన లేకుండా పరిష్కారం చూపాలన్నారు. స్పందన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం కూడదని,జగనన్నకు చెబుదాం`1902 లో నమోదు అవుతున్న వినతులను కూడా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.నేటి స్పందనలో 139 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 50, విద్య 34, పోలీస్ 13, యంఎయుడి 8, డిఆర్‌డిఏ 8, విభిన్న ప్రతిభావంతులు 3, ఏపిఎస్‌పిడిసిఎల్ 3, దేవాదాయ శాఖ 2, వ్యవసాయ2, హెల్త్ 2, రిజిస్ట్రేషన్ స్టాంపులు 2, బిసి వెల్ఫేర్ 2, సోషల్ వెల్ఫేర్ 1, గిరిజన సంక్షేమ 1, డ్వామా 1, ఉపాధి కల్పన 1, మత్స్య శాఖ 1, హౌసింగ్ 1, ఐసిడిఎస్ 1, పంచాయతీరాజ్ 5, ఆర్ డబ్ల్యుఎస్ 1, పౌరసరఫరాలు 1, జాతీయ రహదారులు1, ఆయా శాఖలలో అర్జీలు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని డివిజనల్ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ పరిష్కారమయ్యే వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు.
స్పందన కార్యక్రమంలో డిఆర్‌డిఏ పీిడి కె.శ్రీనివాస్, ఐసిడిఎస్ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, హౌసింగ్ పిడి రజినీ కుమారి, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బాలాజీ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News