విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ సమావేశం, అవార్డుల సమ్మేళనం కార్యక్రమం ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా అక్కడ ఎన్ హెచ్ ఆర్ సి బాధి తులకు అండగా ఉంటుందన్నారు. ఏ రాజకీయ పార్టీతో ఎన్ హెచ్ ఆర్ సి కి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ సంస్థ స్వయం ప్రతిపత్తితో పని చేస్తుందని. మానవ హక్కులను కాపాడటమే లక్ష్యమని చెప్పారు. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం, వారి హక్కులను సంరక్షించుకునేలా సంస్థ పని చేస్తుందని వివరించారు. హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితులకు భరోసాగా నిలుస్తామని తెలిపారు. గత రెండేళ్లల్లో 536 కేసులు తమ కౌన్సిల్ దృష్టికి రాగా, 360 కేసులను విజయవంతంగా పరిష్కరించి నట్టు వెల్లడించారు. స్వచ్ఛందంగా సేవ చేసేవారు తమ కౌన్సిల్లో సభ్యులుగా చేరవచ్చని పిలుపునిచ్చారు. సంస్థలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు, బహుమతులు ప్రదానం చేశారు. సంఘం జాతీయ వైస్ చైర్మన్ కృష్ణ కిశోర్ ని ఘనంగా సన్మానించారు. హైకోర్టు న్యాయవాది రజనీ, తెలంగాణ పోలీస్ అకాడమీ ఫ్యాకల్టీ సభ్యు రాలు రజిత, జాతీయ అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జి అజయ్, కౌన్సిల్ సభ్యులు బుల్లెట్ రవి, అమీన్బాయ్, వెంకటేశ్వరరావు, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్
-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …
Prajavartha Online Telugu News