
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణం పామర్రు రోడ్డులో ‘‘పృథ్వీ మోటార్ సైకిల్స్’’ వారి షైన్ 100 సిసి వాహనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జోనల్ మేనేజర్ సేల్స్ శరద్ ఉండ్రే, జోనల్ మేనేజర్ సర్వీస్ రాహుల్ కుమార్, ఏరియా సేల్స్ మేనేజర్ మంజునాధ్ పాటిల్, ఏరియా మేనేజర్ సర్వీస్ హర్షరెడ్డి, హోండా బిజినెస్ సపోర్ట్ నరేంద్ర పూనియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘పృథ్వీ మోటార్ సైకిల్స్’’ షోరూం ఛైర్మన్ మలెంపాటి రమేష్‌బాబు మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటు ధరలలో నాణ్యమైన అత్యంత ఆధునీకతతో కూడిన వాహనంగా షైన్ 100 సిసి ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా హోండా కంపెనీ వారు 10 సం॥ వారెంటీ ఇస్తున్నట్లు తెలియచేయుటకు సంతోషిస్తున్నారు. షైన్ 100 సిసి అన్ని రకములైన వినియోగదారులకు చేరువవుతుందని తెలియజేస్తూ వాహనం నడుపు సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని తెలియచేశారు. షైన్ 100 సిసి వాహనం కీను కస్టమర్స్ దూసి విద్యాధర్‌కి, జి.కృష్ణంరాజుకి అతిథుల చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో కస్టమర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News