Breaking News

ఏకలవ్యుడు ప్రతి ఒక్కరూ స్ఫూర్తి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టుదల ఏకాగ్రతతో సాధన చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఏకలవ్యుని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో చేపల మార్కెట్ వద్ద గురువారం తొలి ఏకాదశి పర్వదినాన ఏకలవ్యుని జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ఎరుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంభా రాంబాబు అధ్యక్షతన ఏకలవ్యుని కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ మాట్లాడుతూ గురువు లేకుండా ఏకాగ్రతతో విలువిద్యను అభ్యసించి ఏకలవ్యుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనుల సంక్షేమానికి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆ రోజుల్లో గురువు లేకుండా ఏకాగ్రతతో విద్య నేర్చుకున్న ఏకలవ్యుని స్ఫూర్తిగా తీసుకొని నేటితరం విద్యార్థులకు విద్యను అందిస్తున్నారన్నారు. శబ్ద వేది విద్యలో ఆరితేరిన ఏకలవ్యుని దీక్ష, స్ఫూర్తి, ఏకాగ్రతను ప్రభుత్వ పాఠ్యాంశాలలో చేర్చి నేటి విద్యార్థులలో స్ఫూర్తిని నింపాలని పలువురు వక్తలు ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైబ్ ఫెడరేషన్ అధ్యక్షులు మానుపాటి నవీన్, వైయస్సార్సీపి స్టేట్ జనరల్ సెక్రెటరీ ఎస్టీ సెల్ మేడా రమేష్, ఏపీ ఈ ఎస్ ఎస్ రాష్ట్ర సెక్రెటరీ ఆవుల ప్రవీణ్ కుమార్, హైకోర్టు న్యాయవాది వై.వినయ్ కుమార్ తంబి,జిల్లా ఉపాధ్యక్షులు ఏ. సుధీర్ , k. నాగరాజు, నల్లగుళ్ళ బాబు, మంగయ్య, కె.వి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *