Breaking News

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అందరూ కలిసి కట్టుగా విజయవంతం చేయండి : హోంమంత్రి తానేటి వనిత

– అర్హులైన ప్రతి ఒక్కరికీ 100 శాతం సంతృప్తస్థాయిలో పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం..
– కొవ్వూరు నియోజకవర్గంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొన్న హోంమంత్రి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు. జగనన్న సురక్ష కార్యక్రమం పై కొవ్వూరులోని హోంమంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కుల, ఆదాయ, వివాహ, జనన, మరణ ధ్రువపత్రాలు, ఆధార్‌, రేషన్‌ కార్డులు, భూముల మ్యుటేషన్‌, రిజిస్ట్రేషన్‌ వంటి 11 రకాల సేవలను సచివాలయంలోనే జూలై 1 నుంచి ఉచితంగా అందిస్తామని హోంమంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న సురక్ష పధకం దరఖాస్తులు పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని ప్రజా ప్రతినిధులను, అధికారులను, నాయకులను ఆదేశించారు..
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపనతో ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష ప్రారంభించిందన్నారు. జగనన్న సురక్షలో భాగంగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపించాలన్నారు. ఇప్పటికే జగనన్న సురక్షపై వాలంటీర్లు, గృహసారథులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. జూలై 1 నుంచి జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించడానికి మండలస్థాయి అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్త స్థాయిలో పరిష్కారమే లక్ష్యంగా.. నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో తహశీల్దారు, ఆధ్వర్యంలో ఒక టీమ్‌గా, ఎంపిడిఒ ఆధ్వర్యంలో రెండో టీమ్‌గా ఏర్పడతారని, ప్రతి మండలంలో ప్రతిరోజూ రెండు సచివాలయాలకు వెళ్తారని, జులై 1 నుంచి ఈ క్యాంపులను నిర్వహిస్తారని తెలిపారు. పథకాల మంజూరుతోపాటు వివిధ రకాల సర్టిఫికెట్లు జగనన్న సురక్ష కార్యక్రమంలో జారీ చేస్తారన్నారన్నారు. ఆదాయం, కులం, పుట్టినరోజు, కొత్త రేషన్‌కార్డులు, సిసిఆర్‌సి కార్డులు, ఆధార్‌కు బ్యాంకు లింకేజీ, ఆధార్‌ కార్డులో మార్పులు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం కింద చేపడతారన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా చాలా గ్రామాల్లో సమస్యలు పరిష్కరించామని.. ఇంకేమైనా కొన్ని సమస్యలు మిగిలి ఉంటే.. ఈ కార్యక్రమం ద్వారా వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు. గడప గడపకు పూర్తికాని సచివాలయాల్లో ఎక్కువ దృష్టి పెట్టాలని హోంమంత్రి సూచించారు. సచివాలయం సిబ్బందితో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. అదే స్పూర్తితో ఈ కార్యక్రమాన్ని కూడా ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజా ప్రతినిధులుకు, అధికారులకు, నాయకులకు హోంమంత్రి సూచించారు. ఈ సందర్భంగా మే 24న కొవ్వూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటనను ఘన విజయం చేసిన ప్రజలందరికీ హోంమంత్రి తానేటి వనిత మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *