Breaking News

అర్హులందరికీ లబ్ది కోసమే ‘జగనన్న సురక్ష’

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జూలై 1 నుంచి కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం లక్ష్యాలను వివరించారు. అర్హత కలిగిన వారందరికీ ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంతో పాటు అవసరమైన కీలక ధృవపత్రాలు ఎటువంటి రుసుం లేకుండా అందించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లు., 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది., 3 వేల మంది మండల స్థాయి అధికారులు నాలుగు వారాల పాటు 15 వేల క్యాంపుల ద్వారా ప్రజలకు సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 96 సచివాలయాల పరిధిలో 23 క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. వీటి ద్వారా ఏ ఒక్క అర్జీ కూడా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. అలాగే కుల, ఆదాయ, జనన, మరణ, వివాహ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సహా 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఎటువంటి రుసుము లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ఆగష్టు 1 న కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు అందిస్తామని తెలియజేశారు. ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకునేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజలకు క్యాంపులపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. శాచ్యురేషన్ పద్ధతిలో ఇప్పటికే ఈ ప్రభుత్వం నగరాలు, పట్టణాలలో 87 శాతం మంది ప్రజలకు మేలు చేకూర్చిందని మల్లాది విష్ణు అన్నారు. సాంకేతిక, మరే ఇతర కారణాలతో మిగిలిపోయిన అర్హులను కూడా జల్లెడ పట్టి మరీ గుర్తించడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కనుక ప్రతి పేదవాడికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా యంత్రాంగమంతా పనిచేయాలని కోరారు.
అడ్డదారులు తొక్కడం చంద్రబాబు నైజం
ప్రజాశ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తూ.. అందరి మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేయడం సిగ్గుచేటని మల్లాది విష్ణు అన్నారు. కొంతకాలంగా పచ్చ మీడియా ప్రచారం చేస్తున్న ఓట్లన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో జనవరి 11, 2019 లోపు నమోదైన ఓట్లు మాత్రమేనని తెలియజేశారు. కానీ ఎల్లో మీడియా ప్రాంతాన్ని బట్టి అబద్దాలను వండి వారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఒక్క ఎన్నికలోనూ అపూర్వ ప్రజాదరణతో దూసుకెళుతోందని మల్లాది విష్ణు అన్నారు. అటువంటి ప్రభుత్వానికి దొంగ ఓట్లతో ఎన్నికలకు వెళ్లాల్సిన కర్మ పట్టలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కడం చంద్రబాబు నైజమని.. ఈ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు మెండుగా ఉన్నాయని తెలిపారు. 2024లో గెలుపు అసాధ్యమనే నిర్ధారణకు వచ్చే చంద్రబాబు దొంగ మార్గాలను ఎంచుకుంటున్నారని.. వాటన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఇసరపు దేవీ, యరగొర్ల తిరుపతమ్మ, పెనుమత్స శిరీష సత్యం, శర్వాణీ మూర్తి, నాయకులు అలంపూర్ విజయ్, హఫీజుల్లా, ఇసరపు రాజారమేష్, మోదుగుల గణేష్, ఉమ్మడి వెంకట్రావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *