విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తమ బోధనతో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్ కోరారు. నగరంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో కొత్తగా ఎంపికైన సబ్జెక్టు టీచర్లకు ఆదివారం జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. సమగ్ర శిక్ష సొసైటీ, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మూడు కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో ఖాళీగా ఉన్న మూడు సిఆర్టి మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్సెస్ సోషల్ స్టడీస్, నాలుగు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో పిజిటి లు మొత్తం ఏడు పోస్టులకు మహిళా అభ్యర్దుల ను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మే 25వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి 723 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరి వెయిటేజ్ మార్కుల ప్రకారం 1:3 నిష్పత్తిలో ఏడు పోస్ట్ లకు 21 మంది మహిళా అభ్యర్దులను రోస్టర్ ప్రకారం మౌఖిక పరీక్షకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వెయిటేజ్ ఇంటర్వ్యూ లలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసినట్లు జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ అన్నారు. నియామక పత్రాలు అందించిన వారిలో జాయింట్ కలెక్టర్ తో పాటు సమగ్ర శిక్ష, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి మహేశ్వరరావు ఉన్నారు.
Prajavartha Online Telugu News