Breaking News

జగనన్న సురక్ష క్యాంపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ నియోజక వర్గం చందర్లపాడు గ్రామంలో సచివాలయం 2 పరిధిలో సోమవారం నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు, శాసన సభ్యులు డా. మొండితోక జగన్ మోహన్ రావు, శాసనమండలి సభ్యులు డా. మొండితోక అరుణ్ కుమార్ పాల్గొని లబ్దిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమంలో అధికారులు బాథ్యత యుతంగా వ్యవహరించి ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేయాలన్నారు. జగనన్న సురక్ష క్యాంపులో జారీ చేయల్సిన వివిధ రకాల సర్టిఫికెట్లు జాప్యం లేకుండా త్వరితగతిన అందజేయాలని క్యాంపు సిబ్బందిని ఆదేశించారు. సర్టిఫికెట్లు జారీ చేసే విధానంలో పనితీరును సిబ్బంది నుండి కలెక్టర్ ఆరాతీసారు.
ఈ సందర్బంగా శాసన సభ్యులు డా. మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన జగనన్న సురక్ష ఒక వినూత్న కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారం రోజుల పాటు వాలంటీర్, ఇతర సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారికీ అవసరమైన సర్టిఫికెట్ల కొరకు వివరాలు సేకరించి టోకెన్ నంబర్లు ఇచ్చారని వీటి ఆధారంగా నెల రోజులపాటు గ్రామాలలో అర్హులైన వారికీ సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. అర్హత కలిగి ప్రభుత్వ పథకాలు అందని వారిని గుర్తించి న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దళారీ వ్యవస్థకు దూరంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
శాసనమండలి సభ్యులు డా. మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంలో మధ్యవర్తులు దళారీలు లేకుండా నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయన్నారు. అయినప్పటికీ ఎక్కడైనా మిగిలిఉన్న ,లబ్ది దారునకు పథకాలు అందని తరుణంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
కార్యక్రమంలో ఆర్డీవో రవీంద్ర, గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ, సొసైటీ అధ్యక్షుడు రాయల జానకి రామయ్య, మార్కెట్ యాడ్ మాజీ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ కందుల నాగేశ్వరావు, యర్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, బుగ్గినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *