విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2023- 24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ (MPC), మరియు బైపిసి (BiPC) గ్రూపులలో మిగిలిన ఖాళీ సీట్ల ను భర్తీ చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా అధికారి బి. సుమిత్రాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీజీపిసిఇటి (APGPCET ) 2023 మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ నెల 4వ తేదీ మంగళవారం కుంటముక్కల గురుకుల పాఠశాలలో బాలికలకు ఉదయం గం. 9.30 లకు, కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం గం. 2.30 లకు బాలురకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మెరిట్ లిస్ట్ లో ఉన్న విద్యార్థులు పైన పేర్కొన్న విధంగా సంబంధిత కౌన్సెలింగ్ కేంద్రానికి హాజరు కావాలని జిల్లా సమన్వయ అధికారి బి. సుమిత్రాదేవి ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్
-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …
Prajavartha Online Telugu News