గిరిజనులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసిన మన్యంవీరుడు అల్లూరి..

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అల్లూరి సీతారామరాజు 126వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌ క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌లు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రసమరయోదులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజనులను సంఘటితం చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. బ్రిటీష్‌వారి అటవీ చట్టం నుండి గిరిజనలను కాపాడేందుక అనేక పోరాటాలు చేశారన్నారు. ఆయన పారాట వీరుడే కాకుండా అధ్యాత్మిక వేత్త అని అన్నారు. మంచి చేడులను వివరించి పారాటంలోను నైతిక విలువలను పాటించారన్నారు. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ఆయన చూపిన తెగువ, ధైర్యాన్ని, నిబద్దత, దేశభక్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లక్షలాధి మంది త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్య్ర భారత దేశమని, తెలుగునాట ఆంగ్లేయులను ఎదుర్కొన్న మహాజ్వల శక్తి మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాట ఉద్యమం ద్వారా బ్రిటిష్‌ వారి నుండి గిరిజన ప్రజలను విముక్తి కలిగించేందుకు అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అన్నారు. ఆయన అకుంటిత దీక్ష, సాహసం, ఏకగ్రత, పోరాట పటిమ నేటి యువతకు స్పూరి దాయకమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సిద్దిస్తుందని దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన వీరుడు అని అన్నారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125 జయంతి ముగింపు ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి యం. రుక్మాంగదయ్య, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ జె. సునీత, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *