తూర్పు నియోజకవర్గ అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం తోనే సాధ్యమైంది : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్నాయి అని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం 19వ డివిజన్ నందు 20లక్షల రూపాయల గడపగడపకు మన ప్రభుత్వం నిధులతో నూతనంగా నిర్మించిన నందమూరి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్ కు అతి ముఖ్యమైన ఈ రోడ్డు గత పాలకుల నిర్లక్ష్యం వలన గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని గడపగడపకు పర్యటించినప్పుడు మా దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేయడమే కాకుండా శరవేగంగా నిర్మాణం పూర్తి చేసి నేడు ప్రారంభించడం కూడా జరిగింది అని అది వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి కి, పనితీరుకు నిదర్శనం అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన సమస్య పరిష్కారం అవ్వలేదు అని కానీ ఒక్కసారి అవినాష్  దృష్టికి తీసుకెళ్లగానే ఆఘమేఘాల మీద సమస్య పరిష్కారించి చూపించారని స్థానిక ప్రజలు తమ కృతజ్ఞతలు టెకీయజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్ రహేన నాహీద్ వైసీపీ నాయకులు నాహీద్, వలి, జగ్గా, సుభాని, అబిద్ తదితరులు పాల్గొన్నారు.

షాధిఖనా నిర్మాణానికి చర్యలు
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు నియోజకవర్గ ముస్లిం మైనారిటీలకు ఉపయోగపడేలా షాధిఖనా నిర్మిస్తామని ఇచ్చిన హామీ మేరకు 19వ డివిజన్ లో పిచ్చయ్య స్ట్రీట్ లో ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని కేటాయించినట్టు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన అవినాష్ అక్కడ ఉన్న పాత బిల్డింగ్ ను కూల్చివేసి షాధిఖన నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలుపెట్టాలని అధికారులను కోరారు.y వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేసి ముస్లింలకు అందుబాటులో తీసుకొస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *