Breaking News

ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వంగవీటి మోహనరంగా 76 వ జయంతి సందర్భంగా మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులు రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు చేసి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి వీఎం రంగా అని  అన్నారు. పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు వంగవీటి మోహనరంగా అని కొనియాడారు. నిరంతరం పేదల కోసం పోరాడిన వ్యక్తి మోహనరంగా అని అన్నారు. పేదల కోసం పోరాడి అసువులు బాసిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అని తెలిపారు. వంగవీటి మోహనరంగా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. నేటి యువతకు ఆయనొక రోల్‌ మోడల్‌ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు జోగి రమేష్, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చైర్మన్ బండి పుణ్యశీల, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు బొప్పన భవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *