Breaking News

జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులకు వారి చెంతనే ధ్రువపత్రాల పంపిణీ

-సంక్షేమ పథకాల ధ్రువపత్రాల జారీ
-అమ్మ ఒడి ద్వారా మండలంలో రు.53.56 కోట్ల ప్రయోజనం
-రాష్ట్ర హోమ్ మంత్రి డా. తానేటి వనిత.

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగ నన్న సురక్ష కా ర్యక్రమం మరి యు జగనన్న అమ్మఒడి చెక్కు లు పంపిణీ కార్యక్రమం లో మంత్రి వనిత పాల్గొన్నారు. కొవ్వూరు మండ లం దొమ్మేరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో అమ్న ఒడి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ జగనన్న రాష్ట్రం లోని పేద విద్యార్థులను చదివిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ను ఇస్తూ తీర్చి దిద్దడం జరుగుతొందన్నారు. కొవ్వూరు మండలం లో 35707 మంది విద్యార్థులకు 53.56 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు.
జగనన్న సురక్ష పధకం లో భాగంగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారన్నా రు. ఇప్పటికే జగనన్న సురక్షపై వాలంటీర్లు, గృహసారథులతో అవగాహన కార్యక్రమాలు ని ర్వహించామని తెలిపారు. జూలై 1 నుంచి జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించడానికి మండలస్థాయి అధికారులు సిద్దంగా ఉండే విధంగా చర్య లు తీసుకున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు, ప్రజా సమ స్యలు సంతృప్త స్థాయిలో పరి ష్కారమే లక్ష్యంగా నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మండల స్థాయి లో తహశీల్దారు, ఆధ్వర్యంలో ఒక టీమ్‌గా, ఎంపిడిఒ ఆధ్వ ర్యంలో రెండో టీమ్‌గా ఏర్పడతారని, ప్రతి మండలంలో ప్రతి రోజూ రెండు సచివాలయాల కు వెళ్తారని, జులై 1 నుంచి ఈ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించు కోవాలని తెలిపారు. పథకాల మంజూరుతోపాటు వివిధ రకాల సర్టిఫికెట్లు జగనన్న సురక్ష కార్యక్రమంలో జారీ చేస్తారన్నారన్నారు. ఆదాయం, కులం, జనన ధృవ పత్రాలు, కొత్త రేషన్‌ కార్డులు, సిసిఆర్‌సి కార్డులు, ఆధార్‌ సేవలు, బ్యాంకు లింకేజీ, ఆధార్‌ కార్డులో మార్పులు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం కింద చేపడతారన్నారు. జగనన్న ప్రభుత్వం లో ఇప్పటికే గడప గడపకు, స్పందన, జేకేసి ద్వారా మన ప్రభుత్వం ద్వారా చాలా గ్రామాల్లో సమస్యలు పరిష్కరిం చామని అన్నారు . ఇంకేమైనా కొన్ని సమస్యలు మిగిలి ఉంటే, ఈ కార్యక్రమం ద్వారా వెంటనే వాటిని ప రిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ముదునూరి నాగరాజు, సర్పంచ్, తానేటి కుమారి, సుంకర సత్య నారా యణ, యం. డి. ఓ, కె. సుశీల, బండి పట్టాభి రామారావు, ముదునూరి సూర్య నారాయ ణ రాజు, ని యం. ఈ. ఓ. లు, జె. కెంపు రత్నం, కె. కిషోర్, కొవ్వూ రు మండల తాహిసీల్దార్ డి. టి. కె. అజయ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *