విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఏడాది జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటారని పవుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ ఆర్. అమరేంద్ర కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనోటిక్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయటంలో భాగంగా ఈ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటారని చెప్పారు. పశువులు, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులని జూనోటిక్ వ్యాధులు అంటారని వివరించారు. ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్, కుక్కకాటు బారిన పడిన ఒక పిల్లవాడికి టీకా మందు ఇచ్చి బ్రతికించిన రోజు ఇదే కావటంతో దీనిని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. సుమారు 200 రకాలకు పైగా వ్యాధులు పశుసక్ష్యాదుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయన్నారు. కావున జూనోటిక్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేయటంలో భాగమే జూనోసిస్ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. పశుపక్ష్యాదులతో మెలిగే పశువైద్యులు, రైతులు, వధశాల కార్మికులు, పెంపుడు జంతువులతో సన్నిహితంగా ఉండే వారికి ఎక్కువగా ఈ వ్యాధులు సంక్రమిస్తాయని హెచ్చరించారు. వాటిలో రేబిస్, ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్, క్షయ తదితరాలు ఉన్నాయన్నారు. రేబిస్ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని మరియు ప్రాణాంతకమైనదని హెచ్చరించారు. జూనోసిస్ సందర్భంగా ప్రజలకు పశుసంవర్థక శాఖ సిబ్బంది అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. గురువారం నుంచి రాష్ట్రంలోని ఏరియా వైద్యశాలలో, వెటర్నరీ పాలి క్లీనిక్స్ , వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హస్పటల్స్ నందు ఉచితంగా కుక్కలకు యాంటీ రేబీస్ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4.38 లక్షల టీకాలు సిద్దం చేసినట్లు చెప్పారు. ఇతర వివరాలకు సమీపంలోని పశువైద్యాధికారిగాని లేక రైతు భరోసా కేంద్రంలోగాని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1962 కు గాని లేదా సమీకృత రైతు సమాచారా కేంద్రం టోల్ ఫ్రీ నెంబర్ 155251 ను సంప్రదించాల్సిందిగా కోరారు.
Tags vijayawada
Check Also
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు
-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …
Prajavartha Online Telugu News