-ఒకే అపార్టమెంట్ ఓటర్లు ఒకే పోలింగ్ స్టేషన్..
-అపార్టమెంట్ ఓటర్లకు డోర్ నెంబర్‌తో పాటు ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్లు..
-బిఎల్‌వోలకు కలెక్టర్ డిల్లీరావు సూచనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. డిల్లీరావు బూత్ స్థాయి అధికారుల (బిఎల్‌వోలు)ను అదేశించారు.
స్పెషల్ సమరీ రివిజన్ 2024లో భాగంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా శుక్రవారం విశాలాంద్ర రోడ్డు లోని సీతారామపురం ఏరియాలోని మై హోం ఎన్‌క్ల్రెవ్ అపార్టమెంట్‌లో బిఎల్‌వోలు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా పరిశీలనను జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈనెల 21వ తేది నుండి ఆగస్టు 21వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న డోర్ టు డోర్ వెరిఫికేషన్ పై బూత్ స్థాయి అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన కల్పిస్తున్నామన్నారు. అక్టోబర్ 17వ తేది నుండి ప్రారంభం కానున్న ప్రీరివిజన్ యాక్టీవిటీలో భాగంగా ఆయా ఓటర్లకు పోలింగ్‌స్టేషన్ల యొక్క సరిహద్దు నిర్థారిస్తున్నామన్నారు. ఆయా సరిహద్దులలో ఉండే గృహాలు, ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా బిఎల్‌వోలు చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకే అపార్టిమెంట్‌లో నివాసం ఉంటున్న ఓటర్లు వేరువేరు పోలింగ్ స్టేషన్లకు వెళ్ళకుండా చూడడం, కుటుంబంలోని ఓటర్లందరు ఒకేపోలింగ్ స్టేషన్లలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వలస వెళ్లిన ఓటర్ల విషయంలో ఒకటి రెండు సార్లు సరి చూసుకునేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. నగరంలో అపార్టమెంట్లు ఎక్కువగా ఉన్నందున ఆయా అపార్టమెంట్లలో నివసించే ఓటర్లకు డోర్ నెంబర్‌తో పాటు ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ ఉండేలా బిఎల్‌వోలు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే వ్యక్తికి పలు చోట్ల ఓటర్‌గా నమోదు అయి ఉన్న వాటిని ఫోటో నాణ్యత సరిగ్గా లేకపోయిన, వేరే ఫోటో ఉన్న వాటిని గుర్తించాలన్నారు. వెరిఫికేషన్ సమయంలో డోర్ నెంబర్ లేని, ఒకే డోర్ నెంబర్‌లో ఉన్నవి, పేర్లు సరిగ్గా లేనివి, 18 సంవత్సరాలు నిండిన యవతను కొత్త ఓటర్లగా నమోదుకు బిఎల్‌వోలు గుర్తించాలన్నారు. ఓటర్ల జాబితా తనిఖీలో భాగంగా నివాసం లేనటువంటి ఓటర్ల విషయంలో పేరు తొలగింపుకు నిర్ధేశించిన ఫారం 7కు మరణ దృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందన్నారు. ఫారం 8కు సంబంధించి నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పుకు అవసరమైన ధరఖాస్తులను బిఎల్‌వోలు తమతో పాటు తీసుకువెళ్ళవలసి ఉంటుందన్నారు. ఎక్కువ మంది ఓటర్లు నమోదు అయి ఉన్న అపార్టమెంట్లకు సంబంధించి ఆయా మేనేజ్‌మెంట్ వారిని సంప్రదించి ఓటర్ల జాబిత సరిచూసుకునేలా కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. అదే సమయంలో ఓటర్ల జాబితాతో పాటు బిఎల్‌వోలు, కంప్యూటర్ అపరేటర్లు ల్యాప్‌టాప్‌లను తమతో పాటు తీసుకువెళ్ళడం ద్వారా ఓటర్ల జాబితా సరిచూసుకుని అక్కడక్కడే సవరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 29వ తేది వరకు నిర్వహించే రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఒక ప్రాంతంలో 1,500 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లైయితే కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించుకోవాలన్నారు. అక్టోబర్ 15వ తేది నుండి నవంబర్ 30వ తేది వరకు క్లయిమ్స్, అభ్యంతరాలను ఫిల్లింగ్ చేసుకుని డిసెంబర్ 26వ తేదిన పరిష్కరించాలన్నారు. బిఎల్‌వోలు క్షేత్రస్థాయి ఓటర్ల జాబిత పరిశీలనలో తప్పులు దొర్లకుండా నిష్పక్షపాతంగా సజావుగా ఓటర్ల జాబితా సిద్దం చేసి 2024 జనవరి 5వ తేది నాటికి తప్పులు లేని ఖచ్చితమైన తుది ఓటర్ల జాబితాను సిద్దం చేసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు. పరిశీలనలో కలెక్టర్‌తో వెంట విజయవాడ సెంట్రల్ తహాశీల్థార్ వెన్నెల శ్రీనివాస్, బిఎల్‌వోలు ఉన్నారు.
Prajavartha Online Telugu News