Breaking News

ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాలకు పెరుగుతున్న ప్రాధాన్యత


– రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
– ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఐఐఐడీ డిజైన్ కాన్ఫ్లుయెన్స్ అండ్ షోకేస్ ప్రారంభం
– మూడు రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్
– రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా హస్తకళలు, చేతివృత్తుల ప్రదర్శన
– విద్యార్థుల కోసం వర్క్ షాపుల నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోందని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ అమరావతి రీజినల్ సెంటర్, అకార్ ఇన్ఫో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో, నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఐఐఐడీ డిజైన్ కాన్ఫ్లుయెన్స్ అండ్ షోకేస్ ను శుక్రవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్, బిల్డింగ్ మెటీరియల్ కు సంబంధించిన మెగా ఈవెంట్ ను నగరంలో నిర్వహించడం హర్షణీయమన్నారు. ఆయా రంగాల్లో చోటుచేసుకున్న నవీన ఆవిష్కరణలను స్థానికులకు అందుబాటులోకి తీసుకువచ్చిన నిర్వాహకులను విష్ణు అభినందించారు. అనంతరం ఐఐఐడీ అధ్యక్షుడిగా ఎన్నికైన జిగ్నేష్ మోదీ మాట్లాడుతూ.. మూడు రోజులు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఈ ఎగ్జిబిషన్ లో ఏకకాలంలో డిజైన్ షోకేస్, స్టూడెంట్ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భారతదేశంలోని లెజెండరీ ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు డిజైన్ చర్చలు, ప్యానెల్ చర్చలను నిర్వహిస్తారని చెప్పారు. ఈ ప్రాంతంలో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో అత్యున్నతంగా నిర్వహిస్తున్న ఈ డిజైన్ ఎక్స్‌పోలో 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు జిగ్నేష్ మోదీ వెల్లడించారు. ఐఐఐడీ అమరావతి సెంటర్ చైర్ పర్సన్, ఈవెంట్ కన్వీనర్ బాలార్క థెర్లీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎగ్జిబిషన్ లో అంతర్దృష్టితో కూడిన చర్చలు జరుగుతాయని, డిజైనర్లు, విద్యార్థులు, ఎగ్జిబిటర్లకు ఈ ఎగ్జిబిషన్ అనువైన వేదికను సృష్టిస్తుందని థెర్లీ అన్నారు. అకార్ ఇన్ఫో మీడియా మేనేజింగ్ డైరెక్టర్ కమల్ ఖోఖానీ ఈ వినూత్నమైన, ప్రీమియర్ ఎగ్జిబిషన్‌కు హోస్ట్ గా వ్యవహరించారు. డిజైన్ సంగమం ప్రదర్శన, రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ హస్తకళలు, చేతివృత్తుల ప్రదర్శనలు ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఐఐఐడీ డిజైన్ కాన్ఫ్లుయెన్స్ అండ్ షోకేస్ ప్రారంభోత్సవంలో బీఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జై దేశాయ్, ఐఐఎ, బీఎన్ఐ, క్రిడాయ్, నేరేడ్కో, ఇష్రా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 30కి పైగా కంపెనీలు వారి ఉత్పత్తులు, సాంకేతికతలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులేనని, ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *