Breaking News

అగ్ని ప్రమాదం కారణంగా ప్రభావితమైన సెక్ష్సన్ రైలు రాకపోకల కోసం పునరుద్ధరించబడింది

-రైలు నంబర్ 12703లో అగ్ని ప్రమాదం కారణంగా 5 కోచ్‌లు ప్రభావితమయ్యాయి.
-రైలు రాకపోకల కొరకు 17:55 గంటలకు విభాగం పునరుద్ధరించబడింది 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు, ఆనగా , జూలై 7 2023న రైలు నెం. 12703 హౌరా – సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ లో గుంటూరు డివిజన్‌లోని బొమ్మాయిపల్లి – పగిడిపల్లి సెక్షన్‌ మధ్య బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది . ఈ సంఘటనలో ఐదు కోచ్‌లు అంటే S2 నుండి S6 వరకు ప్రభావితమయ్యాయి. పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన రైలులో ఉన్న సిబ్బంది అలారం చైన్‌ని లాగి రైలును నిలుపుదల చేసారు. మంటలు వ్యాపించే కోచ్‌ల వద్దకు చేరుకుని రైల్లోని ప్రయాణికులందరినీ అప్రమత్తం చేయడమేకాకుండా మంటలు చెలరేగిన కోచ్‌లలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపడానికి సహాయము చేసారు . ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రాణ ఆపాయము గాని గాయాలు కాని తగలలేదు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెనువెంటనే ఉన్నతాధికారుల బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ రిలీఫ్ మరియు మెడికల్ రిలీఫ్ వంటి సహకచర్యలను అందించే రైళ్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జనరల్ మేనేజర్ అక్కడికక్కడే సహాయక చర్యలను పర్యవేక్షించడoతోపాటు సికింద్రాబాద్ వైపు వెళ్ళు రైళ్ల రాకపోకల నిర్వహణలో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు
రైలులో చిక్కుకుపోయిన ప్రయాణికులను రైలుతో పాటు బస్సుల ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. రైలు యొక్క ప్రభావితం కాని మిగతా కోచ్‌లను నుండి రైలును వేరు చేసి, దానితో ప్రయాణికులను తీసుకువచ్చారు. అంతేకాకుండా బాధిత ప్రయాణికులను తరలించేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేశారు. చిక్కుకుపోయిన ప్రయాణికులకు క్యాటరింగ్ ఏర్పాట్లు (స్నాక్స్ మరియు వాటర్ బాటిల్స్) కూడా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఘటనపై సమాచారం మరియు రైలు కార్యకలాపాలు తదితర సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
ఇంకా, సెక్షన్‌లో అంతరాయం కారణంగా రద్దు చేయబడిన రెండు రైళ్ల ప్రయాణికులకు ఉపశమనం కలిగించడానికి, క్యాటరింగ్ ఏర్పాట్లతో పాటు బాధిత ప్రయాణికులను రవాణా చేయడానికి బస్సులను కూడా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌తో పాటు గుంటూరు వైపు వెళ్లే ప్రయాణికులకొరకు బస్సులను ఏర్పాటు చేశారు .
ప్రభావిత కోచ్‌ల నుండి సెక్షన్ క్లియర్ అయిన తర్వాత, 17:55 గంటలకు అన్ని విధాలా రైలు కదలిక కోసం ఇది పునరుద్ధరించబడింది. రైలు నం. 17229 (ఖాళీ రేక్) ఈ సెక్షన్‌లో కదిలిన మొదటి రైలు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *