Breaking News

ఈ నెల జూలై 12, 13న జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ నెల జూలై 12,13 న జిల్లాలో పర్యటించనున్నారని అందుకు తగిన ఏర్పాట్ల ప్రణాళికలపై జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి జెసి డికే బాలాజీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నందు జాతీయ రహదారుల పిడి నెల్లూరు వారితో, గూడూరు, సూళ్లూరుపేట ఆర్డీఓ లు కిరణ్ కుమార్, చంద్రముని తదితరులతో మాట్లాడుతూ జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ నెల జూలై 12న రేణిగుంట- నాయుడుపేట జాతీయ రహదారి ఎన్హెచ్-71 మార్గంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశంలోని అన్ని జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయాల పరిధిలోని జాతీయ రహదారుల వెంబడి పెద్ద ఎత్తున సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా రేణిగుంట ప్రాంతం నుండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సాయంత్రం 4గం. లకు ప్రారంభించనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. మరుసటి దినం జూలై13 న తిరుపతి పట్టణంలోని తారక రామ స్టేడియం నందు కృష్ణపట్నం పోర్టు జాతీయ రహదారుల ప్యాకేజీ 2,3 మరియు 4 కు సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కరించి శంఖుస్థాపన చేయనున్నారని, ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగేలా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *