ప్రజా ప్రతినిధులు గుర్తించి అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కారానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ప్రతినిధుల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీలను సంబందిత విభాగాధిపతులే ప్రత్యక్ష్యంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో నగరంలోని కార్పొరేటర్లతో వార్డ్ ల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజా ప్రతినిధులు గుర్తించి అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విభాగాదిపతులను ఆదేశించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం, నగర సమగ్రాభివ్రుద్ది జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం స్పందన, ప్రతి రోజు వార్డ్ సచివాలయాల్లో మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు ప్రజా స్పందన నిర్వహిస్తున్నామన్నారు. వార్డ్ ల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల పై కార్పొరేటర్లు కూడా కమిషనర్ తో చర్చించడానికి ప్రత్యేక సమయం కావాలని కోరి ఉన్నందున ప్రతి శుక్రవారం కార్పొరేటర్లు తమ వార్డ్ సంబందించిన అంశాలు చర్చించేందుకు అవకాశం ఉందన్నారు. మిగిలిన రోజుల్లో కూడా కార్పొరేటర్లు తమ డివిజన్ లోని సమస్యలను వాట్స్ అప్ లో తెలిపినా కూడా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేటర్ల నుండి అందే అర్జీలు, ఫిర్యాదులు, ప్రతిపాదనలను క్రమ పద్దతిలో రికార్డ్ చేసి, తదుపరి చర్యలు కూడా వారికి తెలిపేలా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఆయా విభాగాధిపతులు కార్పొరేటర్లు ప్రతిపాదించిన వాటిలో మౌలిక వసతులకు సంబందించిన వాటికి వెంటనే అంచనాలు సిద్దం చేసి, ప్రతిపాదనలు పంపాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *