విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో టైలర్ వృత్తిదారుల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచింది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం టైలర్స్ పితామహుడు ఏలియస్ హాప్ జయంతి సందర్భంగా ది విజయవాడ టైలర్స్ & వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ జమ్మిచెట్టు స్కూల్ నందు నిర్వహించిన టైలర్స్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గార్లతో కలిసి అసోసియేషన్ ప్రెసిడెంట్ వీనస్ బాబు గారిని సన్మానించి టైలర్లు అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ టైలర్ వృత్తి చాలా గౌరవప్రదమైన వృత్తి అని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి ప్రతి ఏటా 10వేల రూపాయలు అందిస్తూ అండగా నిలిచింది అని తెలిపారు. విజయవాడ టైలర్స్ & వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అవినాష్ హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News