Breaking News

సమస్యల పరిష్కార వేదిక జగనన్న సురక్ష

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తక్షణమే పరిష్కరించేందుకు వేదికగా జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 31 వ డివిజన్ ముత్యాలంపాడులో సోమవారం నిర్వహించిన సురక్ష శిబిరంలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో మన రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి.. చెప్పిన తేదీకే లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా నగదును జమ చేయడం జరుగుతోందన్నారు. శాచ్యురేషన్ పద్ధతిలో నగరాలు, పట్టణాలలోని 87 శాతం మంది ప్రజలకు ఏదో ఒక పథకం రూపంలో మేలు చేకూర్చి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు సూచించిన వారికే పింఛన్లు అదించేవారని గుర్తుచేశారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ నవరత్న పథకాలను అందిస్తున్నామని మల్లాది విష్ణు తెలిపారు. మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని చెప్పారు. వాలంటీర్లు నిర్వహించిన సర్వే ద్వారా డివిజన్లో 1,547 మంది వివిధ రకాల పత్రాల కోసం వినతులు సమర్పించగా.. 772 మంది కుల సర్టిఫికెట్ల కోసం., 758 మంది ఆదాయ., ఐదుగురు EWS., ఇద్దరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు., ఐదుగురు కొత రేషన్ కార్డుల కొరకు అర్జీలు అందజేసినట్లు పేర్కొన్నారు. వీరందరికీ ఎటువంటి రుసుము లేకుండా పూర్తి ఉచితంగా సర్టిఫికెట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

వాలంటీర్ల వ్యవస్థపై ఎందుకంత కడుపుమంట..?
జనసేన అధినేత మతిభ్రమించి మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందుతున్న సేవలపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తుంటే.. పవన్ కు ఎందుకంత ఏడుపు అని ప్రశ్నించారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటైన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచాయని.. ప్రధాని సైతం ఈ వ్యవస్థను ప్రశంసించారని గుర్తుచేశారు. కోవిద్ సమయంలో బయటకు రావాలంటేనే బయపడుతున్న సమయంలో.. ప్రాణాలకు తెగించి వాలంటీర్లు ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థను కించపరిచేలా జనసేన అధినేత మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పవన్ చేసిన దిగజారుడు విమర్శలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఓయూసిడి శకుంతల, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *