Breaking News

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుంది!

-ఆనం కళా కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.
-విద్య మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి.. వారే భావితరాలకు వారు వారసులు
-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత
-ఎంపి మార్గాని భరత్ రామ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని, రాష్ట్రంలో వారికి అత్యున్నత విద్యను అందించడం జరుగుతొందని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధి కలెక్టర్, ఎంపి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో ఎపుడూ ఒక మాట అంటూ ఉంటారని, విద్య అనేది పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి అని అన్నారు. భావితరాలకు బాలలే వారసులని కలెక్టర్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు చేయడం, ఆధునిక బొధనా పద్ధతులను, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్ ద్వారా బోధన విధానం లో అంతర్జాతీయ స్థాయి భోధన పద్దతులు అందిస్తోందని అన్నారు. ప్రభుత్వ యొక్క లక్ష్యాన్ని అర్ధం చేసుకుని విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి రావాలన్నారు. సాధించాలన్న కోరిక, ఎంపిక చేసుకున్న లక్ష్యం పట్ల స్థిర నిర్ణయం పట్టుదల, క్రమశిక్షణ, అంకిత భావంతో సాధన చేసిన ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరతారని చెప్పారు.

పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, బాలలు బాగా చదివి ప్రయోజకులు అయితే దేశ ప్రగతి ,అభివృద్ధికి దోహదపడతారన్నారు. తద్వారా దేశ భవిష్యత్తు నిర్ణయించబడు తుందని అన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో నెంబర్ వన్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలల కోసం వారి భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందించే దిశగా పాఠశాలలను బలోపేతం చేయడంలో నాడు..నేడు , అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య వంటి అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. ముఖ్యంగా పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు “అమ్మఒడి” కార్యక్రమం ద్వారా ఆయా కుటుంబాలకు ఆర్ధిక భరోసా ఇచ్చారన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్, ఎంపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టు కున్నాయి.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ డా. గూడూరు శ్రీనివాసరావు, మాజీ రుడాచైర్పర్సన్ ఎం.షర్మిలారెడ్డి, చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యురాలు టి.ఆదిలక్ష్మి, జువనైల్ జస్టిస్ బోర్డ్ మెంబర్ తబిత, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.అబ్రహాం, జిల్లా మహిళా శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారిణి కె.విజయ కుమారి, రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఈవిబిఎన్.నారాయణ, అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్, సిఆర్ పి లు,విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *