Breaking News

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగస్తులకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగస్తులకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రాన్ని డి ఆర్వో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీ. నరసింహులు వివరాలు తెలుపుతూ, ఎపిపీఏస్సి ఆధ్వర్యంలో గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఫంక్షనరీల కేటగిరీ లోని పి ఆర్ మరియు ఆర్ డి డిపార్ట్‌మెంట్‌లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II, విఆర్వో గ్రేడ్-I & రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు మరియు కారుణ్య కారణాలపై నియమితులైన ఉద్యోగులకు రెండు షిఫ్ట్ లలో కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. రెండవ షిఫ్ట్ లో మొత్తం 110 కి గాను 99 హాజరు కాగా, 3 వ తర షిఫ్ట్ కి చెందిన 115 మందికి గానూ 100 హజరైనట్లు డిఆర్వో వెల్లడించారు. మొదటి, నాల్గోవ షిఫ్ట్ లలో పరీక్షలు నిర్వహించడం జరుగలేదన్నారు. ఈ సందర్శనలోఎపిపి ఎస్సీ అధికారులు ఎన్. అనియమ్మ, లైజనింగ్ అధికారి తహశీల్దార్ ఎమ్. నాగలక్ష్మి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *