విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు తెలుపుతు పార్టీలో చేరడం శుభపరిణామం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నాయకులు కేక రఫీ నాయకత్వంలో దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలు వైస్సార్సీపీ లో చేరడానికి ముందుకు రాగా అవినాష్ వారందరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్ గారు రాష్ట్రంలో జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని, ప్రజల మద్దతు తో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కొత్త పాత నాయకుల కలయిక లో తూర్పు నియోజకవర్గంలో వైస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీ, కొండ్రు ఆనంద్,విజయ్,దడ ,సైదా, దుర్గ రావు ,పూర్ణ,కదిర, అవినాష్, మల్లికార్జున రావు , భార్గవ్ ,సాయి , లక్ష్మణ్, రామ్ నాయుడు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News