-జిల్లాలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రీ సర్వే, గృహ నిర్మాణ శాఖ, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, ప్రాధాన్యత భవనాల నిర్మాణం తదితర సంబంధిత అంశాలపై ప్రణాళికా బద్ధంగా పని చేసి నిర్దేశిత గడువులోపు పురోగతి సాధించాలి అని, జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం సిఎస్ క్యాంపు కార్యాలయం విజయవాడ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వర్చువల్ విధానంలో రెవెన్యూ ఫేజ్ -3 రీ సర్వే, ఇనామ్ మరియు ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్డ్ భూములు, పేదలందరికీ ఇళ్ళు ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖ లో గృహ నిర్మాణ పురోగతిపై, పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖపై కరువు మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలు, వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలు, ప్రాధాన్యత భవనాల పురోగతి, వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబం సంక్షేమo కు సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష, సంతృప్త స్థాయిలో అర్హులైన అందరికీ ఆరోగ్యశ్రీ కార్డుల డిస్ట్రిబ్యూషన్ అంశాలపై కలెక్టర్ల స్పందన వంటి పలు అంశాలపై సంబంధిత కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ రీ సర్వే, గృహ నిర్మాణ శాఖ, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు, ఉపాధి హామీ పనులు తదితర సంబంధిత అంశాలపై ప్రణాళికా బద్ధంగా పని చేసి నిర్దేశిత గడువులోపు పురోగతి సాధించాలి అని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అన్నారు. జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు పథక సంచాలకులు డ్వామా శ్రీనివాస ప్రసాద్, డిసిహెచ్ఎస్ ఆనంద మూర్తి, జిల్లా సర్వే అధికారి జయరాజ్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, డిపీఎంఓ శ్రీనివాస్, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ కర్త రాజశేఖర్ రెడ్డి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News