నమ్మకద్రోహనికి మారుపేరు చంద్రబాబు నాయుడు:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తన ఎదుగుదల స్వార్ధ ప్రయోజనాల కోసం నమ్మిన వారిని నమ్ముకొన్న వారిని నట్టేట ముంచే నీచ వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు ది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. సోమవారం మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ ఆనంద్ భవన్, కోత మిషన్ రోడ్, మార్వాడి రోడ్ ప్రాంతాల్లో పర్యటించిన అవినాష్ ఈ నాలుగున్నర ఏళ్ల వైసీపీ ప్రభుత్వం లో చేసిన మంచిని వివరించి, మరలా అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టబోయే కార్యక్రమల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 7 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ డివిజన్ లో రోడ్లు, డ్రైనేజ్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కోటిన్నర పెట్టీ ధోభీఘట్ ను అభివృద్ధి చేసి ప్రహరిగొడ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ది అందించిన ఘనత ప్రభుత్వానిదే అని తెలిపారు. ఒకపక్క ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకొంటూ ముందుకి వెళుతుంటే మరోపక్క ప్రతిపక్షాలు సీట్ల పంపకాలు, అసంతృప్తిలతో సతమతమవుతున్న పరిస్థితి ఉందని అన్నారు. వారి అజెండా రాష్ట్ర అభివృద్ధి కాదు అని అధికార యావ మాత్రమే అని విమర్శించారు. సీట్ల పంపకం అయిన తర్వాత జనసేన నాయకుల దీనస్థితి చేస్తుంటే జాలి వేస్తోంది, చంద్రబాబు ని నమ్ముకుంటే పొత్తు ధర్మం కూడా విస్మరించి కేవలం 24 సీట్లు ఇచ్చి మోసం చేసారని వారు వాపోతున్నారు అని అన్నారు. నమ్మకద్రోహనికి మారుపేరు చంద్రబాబు అని ఆయన వలలో పడి పవన్ కళ్యాణ్ పార్టీని నట్టేట ముంచారని జనసేన నాయకులు మండిపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు అన్ని కట్టకట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం వారి తరం కాదు అని, ప్రజల మద్దతు తో రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండా రెడ్డి,డివిజన్ అధ్యక్షులు జోగా రాజు,నాగిరెడ్డి,పులి రమణా రెడ్డి,గొర్ల గోవింద్,ఆషిఫ్,ఫజులుద్దీన్,జావీద్,ఖాసీం తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *