రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యా భివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి , పశ్చిమ , కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాజమండ్రీ అర్బన్ నియోజకవర్గం లోని మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీన “మెగా ప్రాంతీయ జాబ్ మేళ” నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం కొండలరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాలో 150 కంపనీలు హాజరుకానున్నాయని ఆయన తెలిపారు. వీటిలో గల వివిధ ఉద్యోగాలలో పనిచేయడానికి ఫార్మసీ, బి టెక్, యం బీ ఏ, యం. టెక్, యం ఫార్మసీ, ఐ టీ ఐ, ఇంటర్, పదవ తరగతి, పూర్తి చేసిన 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల వారు అర్హులని ఆయన వివరించారు.
ఫిబ్రవరి 28 న నిర్వహించే ” మెగా ప్రాంతీయ జాబ్ మేళా” కు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా వారి వివరాలను
https://tinyurl.com/ZONEII-RegionalJobMela ” రీజనల్ జాబ్ మేళా” కు రెజ్యూమెలతో పాటు ఆధార్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో, సిద్ధపడి ఈనెల 28 వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు మార్గని ఎస్టేట్ వద్దకు రావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండలరావు తెలిపారు.
మరిన్ని వివరాలకు “9676052454”, 9133912947″నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
Prajavartha Online Telugu News