విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ స్టెల్లా కళాశాల లో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యం లో 3 రోజుల జాతీయ సదస్సు ను కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జ్ఞానమణి ప్రారంభించారు. రీసెంట్ రీసెర్చ్ అడ్వాన్స్మెంట్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ అనే అంశం పై 3డేస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటుచేస్తామని నూతన ఆవిష్కరణలు గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కొత్త విషయాలు చర్చలు జరపటం వల్ల ఈ సదస్సు విద్యార్థులకు ఉపయోగ పడుతూనదని Dr సిస్టర్ రేఖ ప్రిన్సిపల్ తెలిపారు. prof జ్ఞానమని మాట్లాడుతూ దైనందిన జీవితం లో కంప్యూటర్ టెక్నాలజీ మరియు ఆధునిక సాంకేతికత మమేకమై పోతున్నాయని, కంప్యూటర్స్ మొబైల్స్ ఇంటర్నెట్ సౌకర్యాలు లేకపోతే మానవ జీవితం సాఫీగా సాగే లేదని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,సైబర్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ,బిగ్ డేటా వంటి అంశాలు గురించి విద్యార్థులు తెలుసుకోవాలని తెలిపారు. అనంతరం కాన్ఫరెన్స్ కు సంబంధించిన సంచికను రిలీజ్ చేశారు. Prof త్యాగ రాజన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ సైన్సెస్ సెంట్రల్ యూనివర్సిటీ,డే క్ బాలకృష్ణ,క్రిస్ట్ యూనివర్సిటీ బెంగుళూర్ గౌరవ అతిథులుగా విచ్చేశారు. కరస్పాండెంట్ dr సిస్టర్ లేన క్వడ్రశ్,dr సిస్టర్ జాసింత క్వాడ్రస్, డిగ్రీ వైస్ ప్రిన్సిపల్ ఉషా కుమారి, అధ్యాపకులు గ్రేస్ లిడియా, విద్యావతి,మాలతి, సిస్టర్ సుజిత మరియు డిగ్రీ విద్యార్థినులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News