Breaking News

ప్రభుత్వ కళాశాలలో ఘనంగా నిర్వహించిన ఓపెన్ ల్యాబ్ డే

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆటానమస్ కళాశాలలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఓపెన్ ల్యాబ్ డే నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనను డిగ్రీ కళాశాలల ఆర్జేడీ డాక్టర్ చప్పిడి కృష్ణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను మరియు స్వదేశీ విజ్ఞానం-వికసిత భారత అభివృద్ధి గురించి తెలియజేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన నమూనాలు ఆసక్తి గా తిలకించారు.

ఇందులో విద్యార్థులు ప్రదర్శించిన చంద్రయాన్ -3 నమూనా, అవరోధాలను గుర్తించే రోబో, రసాయన శాస్త్రం నుండి పర్యావరణ హిత ప్లాస్టిక్, అమ్ల వర్షాలు, మైక్రో బయాలజీ విభాగం నుండి జన్యు మార్పిడి ద్వారా ఉత్పత్తి అయ్యే పంటలు, కలుషిత ఆహారమును గుర్తించు విధానం, సాంఖ్యక శాస్త్ర విభాగం నుండి సైబర్ క్రైమ్ లో రకాలు, కృత్రిమ మేధ, వృక్ష శాస్త్రం విభాగం నుండి ప్రకృతి సేద్యం మరియు సమీకృత సేద్యంలో రకాలు, జంతు శాస్త్రం నుండి గుండె మరియు మూత్ర పిండాలు పనిచేసే నమూనాలు, భూగోళ శాస్త్రం విభాగం నుండి ఖండ చలన సిద్దాంతం మరియు అగ్ని పర్వత విస్పోటన నమూనాలు అదేవిధంగా భు విజ్ఞాన శాస్త్రం నుండి పునరుత్పాదక శక్తి వనరుల నమూనాలు మరియు ఖనిజ సమ్మేళనాలు ప్రదర్శించారు. సదరు కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి కే వాసుదేవ రావు గారి నేతృత్వం లో నగరంలోని వివిధ స్కూల్స్ నుండి విద్యార్థులు విచ్చేసి ప్రదర్శనలు తిలకించారు. ఈ కార్యక్రమం ఇన్స్టిట్యూట్ ఇన్నోవేటివ్ కౌన్సిల్ ఆధ్వర్యం లో నిర్వహించటం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సమస్యలపై గిరిజన సంఘాలతో త్వరలో ప్రభుత్వం చర్చలు

-గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యమిస్తాం…ఆందోళన పడకండి! -జీవో నెంబర్ 3 ప్రయోజనాలు దక్కేలా ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం -ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *