విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్నఇప్పటి పరిస్థితుల్లో ప్రతివారూ మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదని ప్రముఖ సామాజిక వేత్త, వ్యాపారవేత్త రిఫ్లెక్షన్స్ పార్ధ సారధి (బుజ్జి) అన్నారు. నగరంలో రిఫ్లెక్షన్స్ పార్ధ సారధి (బుజ్జి) సుపరిచితుడు. గతంలో లాక్ డౌన్ సమయంలో నుండి ఇప్పటివరకు కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో అనేక పేద కుటుంబాలకు అనేక గుప్త దానాలు, విరాళాలు అందచేశారు. తమదగ్గర పనిచేసే సిబ్బందినే కాకుండా చుట్టుపక్కల వారికి అవసరానికి ఆదుకునే మంచి మనసు, మంచి భావాలు వున్న వ్యక్తి అని పేరువున్నది. అటువంటి రిఫ్లెక్షన్స్ పార్ధ సారధి (బుజ్జి), “అమృత హస్తం” దారా కరుణశ్రీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిత్యం ఎంతో మందికి ఆకలి తీరుస్తూ కరోనా బాధితులకు ఆక్సీ మీటర్స్, శానిటైజర్, చేతి గ్లవుజులు, ఎన్ 95 మాస్క్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రిఫ్లెక్షన్స్ పార్ధ సారధి (బుజ్జి) మాట్లాడుతూ ఇప్పటి విపత్కర పరిస్థితిలో దేవుని దయ వలన, అందరి సమిష్టి కృషి వలన పేదలకు, కరోనా బాధితులకు సేవలందించడంలో చేతనైనంతలో సాయం చేస్తున్నామన్నారు. వీలైనంతవరకూ ప్రతి వారు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించి తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా వారు ఉండాలని, బయటకు అవసరమైతే తప్పితే ఇంటి వద్దే క్షేమంగా ఉంటూ పెద్దలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవడం తీసుకోవడం మంచిదన్నారు. ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో మంచిదన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, ప్రజలు సమిష్టి పోరాటంతోనే కరో నా కట్టడి చేయగలుగుతామని అదే మనందరి ప్రధమ కర్తవ్యమన్నారు. రిఫ్లెక్షన్స్ పార్ధ సారధి (బుజ్జి) చేసే ఈ ప్రయత్నం మరి కొంతమందికి స్ఫూర్తి అవుతుంది అని భావిద్దాం.
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …