రీజనల్ తపాలా అదాలత్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా సేవలకు సంబంధించి వినియోగదారుల యొక్క ఫిర్యాదులు మరియు సమస్యలు పరిష్కరించు నిమిత్తము తేది: 13/03/2024 ఉ:11:30 డి.యస్.వి.ఆర్. మూర్తి (IPOS), పోస్ట్ మాస్టర్ జనరల్, విజయవాడ రీజియన్, విజయవాడ వారిచే రీజనల్ తపాలా అదాలత్ నిర్వహించబడును. తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు మరియు సమస్యలు ఈ అదాలత్ నందు పరిష్కరించబడును. తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులు తేది:07/03/2024 లోగా “తపాలా అదాలత్” శీర్షికతో అసిస్టెంట్ డైరక్టర్ (స్టాఫ్), పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయం, గాంధీనగర్, విజయవాడ-520003 అను చిరునామాకు పంపవలసినదిగా కోరడమైనది. ఫిర్యాదు దారులు వ్యక్తిగతంగా కూడా హాజరు కావొచ్చునని పోస్ట్ మాస్టర్ జనరల్ వారు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *