Breaking News

ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహా సందర్శన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలురతో మాట్లాడి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదువుకోవాలని అన్నారు. చెడు పనులు చేయకపోయినా అలాంటి పనులు చేసే వారితో ఉన్నవారికి కూడా పరిణామాలు వర్తిస్తాయని, కాబట్టి చెడు సహవాసాలకు దూరంగా ఉండాలని వివరించారు. ఉచితంగా న్యాయవాదిని పొందడం వారి హక్కు అని తెలిపారు. వసతి గృహములో ఎటువంటి సమస్యలున్నా. ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. చిల్డ్రన్ జైల్ పర్యవేక్షకులు భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సమస్యలపై గిరిజన సంఘాలతో త్వరలో ప్రభుత్వం చర్చలు

-గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యమిస్తాం…ఆందోళన పడకండి! -జీవో నెంబర్ 3 ప్రయోజనాలు దక్కేలా ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం -ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *