విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ఆంజనేయ వాగు సెంటర్ లోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం దేవస్థానం ప్రాంగణంలో ఘనంగా జరిగింది. శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నూతన పాలకమండలి చైర్మన్ గా వంశపారంపల్లి ధర్మకర్త నందిపాటి శ్రీనివాసరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అలాగే ధర్మకర్తలగా చలమల శెట్టి జగదీష్, అయితా మాణిక్యాలరావు, పోతిన గాయత్రి, యలమంచిలి భవాని, పువ్వుల తులసి, గుర్రం బేబీ స్వప్న ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలకమండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా విన్నకోట శ్రీనివాసరావు శర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశ్వరరావు నూతన పాలకమండలి వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ,వైసిపి పశ్చిమ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, కార్పొరేటర్లు అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబు, మరుపిళ్ళ రాజేష్ తదితరులు పాల్గొని నూతన పాలక మండలి వారిని అభినందించారు. దేవస్థానం అభివృద్ధికి మంచి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News