విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో శ్రీశ్రీ క్రియేషన్స్ శ్రీపద్మావతి ఫిలిమ్స్ వారి షార్ట్ ఫిలిం ‘నారీశక్తి’ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. శుక్రవారం గాంధీనగర్, ప్రెస్‌క్లబ్‌లో జరిగిన షార్ట్ ఫిలిం ‘నారీశక్తి’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత సతీష్ చంద్ర, దర్శకులు హర్షిత విప్పర్ల, మోహిత్ రాథోడ్ చిత్రయూనిట్ సమ్మెట గాంధీ, గీత, కీర్తి, నీరజ, లావణ్య, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిధులుగా నగర ప్రముఖులు గోళ్ళ నారాయణరావు తదితర ప్రముఖులు హాజరై చిత్రయూనిట్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులు ఎప్పుడూ మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తారని, ఆ దిశలో ఈ షార్ట్ ఫిలిం ‘నారీశక్తి’ విజయంవంతం కావాలని ఆకాంక్షించారు. కళను ప్రోత్సహించే కళాకారులకు ఎప్పుడూ తమవంతు సహకారం వుంటుందని అవసరమైతే సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. చిత్రం యూనిట్ మాట్లాడుతూ చిత్రంలో తమమీద నమ్మకంతో నటించేందుకు అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత, దర్శకులు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సమాజంలో మహిళలకు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు దృష్టిలో వుంచుకుని కొత్త కాన్సెప్ట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో అందరి సహకారంతో కష్టపడి ఈ షార్ట్ ఫిలిం తీశామన్నారు. దీనిని ప్రేక్షకులు ఆశీర్వదించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News