జిల్లా జగనన్న వసతి దీవెన కింద రు.24.09 కొట్లు జమ

-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా లో జగనన్న విద్యా దీవెన కింద 2023-24 ఏడాదికి సంబంధించి 31926 విద్యార్థులకి చెందిన 28730 తల్లుల ఖాతాలోకి  రూ.24,09,39,718/- లు జగనన్న విద్యా దీవెన మొదటి విడత నిధులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారము రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామర్రు లో జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా నగదు బదలీ (డిబిటి) చేశారు.

స్ధానిక కలక్టరేట్ లో నిర్వహించినా జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, గత ఏడాది 2022-23 నకు సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద నాలుగు విడతల్లో రూ.92 కోట్ల 18 లక్షలు విద్యార్ధుల తల్లుల జాయింట్ ఖాతాలో జమ చెయ్యడం జరిగిందన్నారు.  చదువు పట్ల విద్యార్ధుల లో తల్లిదండ్రులలో అంకిత భావం కలుగ చేసేలా హాజరు శాతం విద్యా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు.

నేడు 2023-24 ఏడాదికి సంబంధించి మొదటి విడతగా 31926 విద్యార్థులకి చెందిన 28730 తల్లుల ఖాతాలోకి  రూ.24,09,39,718/- లు జగనన్న విద్యా దీవెన మొదటి విడత నిధులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో  జమ చెయ్యడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంబందించి షెడ్యుల్ కులాలకు చెందిన  6506 మంది విద్యార్థుల కు చెందిన 5909 తల్లుల ఖాతాలో రూ.4,48,07,032 లు , షెడ్యూల్ తెగలకు చెందిన 177 మంది విద్యార్థుల కు చెందిన 156 మంది తల్లుల ఖాతాలో రూ.10,37,877 లు , వెనుక బడిన తరగతులకు చెందిన 14,050  మంది విద్యార్థుల కు చెందిన 12,554 తల్లుల ఖాతాలో రూ.10,26,09,195 లు , ఆర్ధిక వెనుకబడిన తరగతులకు చెందిన 3583 మంది విద్యార్థుల కు చెందిన 3,309 మంది తల్లుల ఖాతాలో రూ.3,43,01, 761 లు , ముస్లిం మైనారిటీ లకి చెందిన 675 మంది విద్యార్థుల కు చెందిన 610 మంది తల్లుల ఖాతా లో రూ.54,24,805 లు , కాపు లకు చెందిన 6,781 మంది విద్యార్థుల కు చెందిన 6,409 మంది తల్లుల ఖాతా లో రూ.5,15,44,424 లు  , క్రిస్టియన్ మైనారిటీస్ కి చెందిన 154 మంది విద్యార్థుల కు చెందిన 153 మంది తల్లుల ఖాతా లో రూ.12,14,624 లు మేర ప్రయోజనం కలిగించినట్లు తెలిపారు.

లబ్ధిదారుల అభిప్రాయం …
లంక పాకలు, రంపచోడవరం, డిగ్రీ ఫస్ట్ ఇయర్  ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి, కుండ్ల  క్రాంతి కుమార్ …. జగనన్న విద్యా దీవెన ద్వారా అందుతున్న ఆర్ధిక సహాయం నా చదువులకి ఎంతో ఉపయోగ పడుతోందని అన్నారు. 10 వ తరగతి చదివే సమయంలొ అమ్మ ఒడి ఇవ్వడం జరిగిందని, నేడు డిగ్రీ కోర్సులు చేసేందుకు జగనన్న విద్యా దీవెన అందజేస్తూ జగనన్న ఎంతో మేలు చేకూరుస్తున్నారు.  గతంలో ప్రభుత్వ స్కూల్స్ లో ఎటువంటి సదుపాయాలు అందుబాటులో ఉండేవి కావని, కానీ నేడు జగనన్న వచ్చాకా నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. స్కూల్స్ లో కొత్త నిర్మాణాలు చేపట్టడం, ఉపాధ్యాయులను నియమించడం, మంచిగా బోధన పద్ధతులు అమలు చేస్తూ ఉన్నతమైన చదువులు చదివి విధంగా అన్నీ విధాల భరోసాగా నిలుస్తున్నారని తెలియ చేశారు.

తాండవపల్లి, కోనసీమ జిల్లా, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థి, గుత్తాల లక్ష్మి …. మాట్లాడుతూ, మాలాంటి పేద కుటుంబాల విద్యార్దులు జగనన్న విద్యా దీవెన పథకం వల్ల చదువుకో గలుగుతున్నట్లు తెలిపారు. నాలాగే ఎందరో పేద వర్గాల కు చెందిన వారు చదువు కోవడానికి విద్యా దీవెన ఎంతో మేలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మా తండ్రి వ్యవసాయం చేస్తున్నారు, వారికీ రైతు భరోసా కింద ఆర్ధిక సహాయం అందడం, నా చెల్లికి అమ్మ ఒడి కింద రూ.15 వేలు జగనన్న జమ చెయ్యడం జరిగిందన్నారు. ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగనన్న కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎస్ జ్యోతి, జిల్లా బిసి సంక్షేమ అధికారి పీ ఎస్ రమేశ్, వసతి గృహం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *