లోక్ అదాలత్ మార్చి 16 వ తేదీ మూడో శనివారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం మార్చ్ 9 వ తేదీన (2వ శనివారం) జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ ను మార్చి 16 వ తేదీన (3వ శనివారం) నిర్వహించ నున్నట్లు తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని అన్ని న్యాయస్థానాలలో అన్ని రకాల సివిల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించు కోగలరని అన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి మార్చి 16 వ తేదీ 3 వ శనివారం రోజున జరుగు జాతీయ లోక్ అదాలత్ నందు వారి సమస్య లను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *