జిల్లాలో 15 వందలు ఓటర్లు ఉన్న ఎనిమిది పి ఎస్ ల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

-జిల్లాలో 232 కేంద్రాల పేర్ల మార్పు, 17 లోకేషన్స్ మార్పు
-త్వరలో రాజకీయ పార్టీల, మీడియా ప్రతినిధుల తో కార్యశాల
-జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్లు సత్వరం ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనువుగా పోలింగ్ కేంద్రాలను హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేయనున్నట్లు కలక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రేషనలైజేషన్ పై కలక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 1500 మంది కి పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాల గుర్తించి, ఆయా పి ఎస్ లని ఓటర్ల సంఖ్య ఆధారంగా ఎ , బి లుగా ఏర్పాటు చేసి ఓటర్లు ఓటు హక్కును వినియోగించు కునేందుకు అనువుగా ప్రతిపాదనలని చేయటం జరిగిందన్నారు.. ఇప్పటికే నియోజక వర్గ స్థాయి లో రిటర్నింగ్ అధికారులు రాజకీయ పార్టీల తో సమావేశాలని నిర్వహించి ప్రతిపాదనలని పంపినట్లు తెలియ చేశారు. పోలింగ్ కేంద్రం వాస్తవ సంఖ్య, అదనపు పోలింగ్ కేంద్రానికి “ఏ” తో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనుసంధానంగా కొత్తగా చేస్తున్న పి ఎస్ కి పోలింగ్ సిబ్బందిని కుడా అదనంగా నియమిస్తామని మాధవీలత పేర్కొన్నారు.

రాజమండ్రీ సిటీ నియోజక వర్గ పరిథిలో 14 , 17 , 29 , 155 , 168 , రాజమండ్రీ రూరల్ పరిథిలో 17 , 30 , 31 పోలింగ్ కేంద్రాకు అందనంగా ” ఎ ” తో కూడిన విధంగా ఉదాహరణ – 14 , 14 ఎ ;  17 , 17 ఎ లను ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకు అనుగుణంగా పొలింగ్ సిబ్బందిని కూడా నియమిస్తామని తెలిపారు.

ఏ నియోజక వర్గంలో ఆ నియోజక వర్గం ఎన్నికల ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందనీ అన్నారు. ఓటింగ్ పూర్తి అయినా తరువాత అన్ని నియోజక వర్గాల కి చెందినా బ్యాలెట్ బాక్సులు నన్నయ్య యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రం కు తిసుకుని రావడం జరుగుతుందని తెలియ చేశారు. బ్యాలెట్ బాక్సులు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కి తరలించడం జరుగుతుందనీ అన్నారు. సమావేశంలో ఏ ఏ నియోజక వర్గాల ఎక్కడ స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరుగుతోందో వివరాలు రాజకీయ పార్టీలకి అందచేసినట్లు తెలిపారు. అదే విధంగా ఓటింగ్ అయిన తదుపరి ఆయా నియోజక వర్గాల నుంచి బ్యాలెట్ బాక్సులు నన్నయ్య యూనివర్సిటీ లో కేటాయించినా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, ఓటింగు పూర్తి చేసిన తరలించే స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాలు వివరాలూ అందచేస్తున్నట్లు కలక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీలతో, మీడియా ప్రతినిధుల తో ప్రత్యేక సమావేశం నిర్వహించి , ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల పై కార్యసాల నిర్వహిస్తామని మాధవీలత పేర్కొన్నారు. నామినేషన్ వేసే అభ్యర్ధులు ప్రత్యేకంగా ఎలక్షన్ కోసం కొత్త బ్యాంకు ఖాతాను ప్రారంభించాలి అని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , డి ఆర్వో జి. నరసింహులు, కె ఆర్ ఆర్ సీ ఎస్ డి టి/ రాజమండ్రి సహయ ఆర్వో ఆర్. కృష్ణ నాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ – నలబాటి రమేష్ (శ్యామ్), బిజెపి – బి. రామచంద్రా రావు, టిడిపి – చెల్లుబో యిన శ్రీనివాస రావు, వైసిపి –  కె ఆర్ జయకర్ , అర్బన్ తహసీల్దార్ కే. ఆంజనేయులు,  ఎలక్షన్స్ డీ టి పవన్ కుమార్,  సునీల్ తదితరుల లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *